Year Ender 2023: ఈ ఏడాది గ్రౌండ్ ను షేక్ చేసిన విరాట్ కోహ్లీ అద్భుతమైన‌ ఇన్నింగ్స్ ఇవే..

First Published | Dec 25, 2023, 3:16 PM IST

Yearender2023-sports: ఈ ఏ ఏడాది  విరాట్ కోహ్లీ త‌న అద్భుత‌మైన ఆట‌తో మాస్టర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో విరాట్ తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. 
 

Virat Kohli, India, cricket

Yearender2023-cricket:  విరాట్ కోహ్లీ ఈ ఏడాది త‌న అద్భుత‌మైన ఆట‌తో మ‌రిన్ని రికార్డుల న‌మోదుచేశాడు. త‌న బ్యాట్ తో మ‌రోసారి తాను ర‌న్ మెషిన్ అనే విధంగా అద‌ర‌గొట్టి విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఆడిన కొన్ని బెస్ట్ ఇన్నింగ్స్ ను గ‌మ‌నిస్తే.. విరాట్ కోహ్లి 2023 సంవత్సరంలో ఆరు సెంచరీలు సాధించాడు. గౌహతిలో శ్రీలంకపై 87 బంతుల్లో 113 పరుగులు చేయడంతో ఆ సంవత్సరంలో అతని మొదటి సెంచరీ న‌మోదుచేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన అదే సిరీస్‌లో, తిరువనంతపురంలో విరాట్ 110 బంతుల్లో 166 పరుగులు చేసి భారత్‌కు 317 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. విరాట్ సుడిగాలి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

Virat Kohli, India, cricket

ఇక ఆసియా కప్ 2023 లో భార‌త్ వ‌ర్సెస్ పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో, విరాట్ కోహ్లి 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్‌లతో అజేయంగా 122 పరుగులు చేశాడు. భారత్ 356/2 భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. పాకిస్థాన్ కేవలం 128 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ర‌న్ మిష‌న్ విరాట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఈ త‌ర్వాత ఆడిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి తన 48వ వన్డే సెంచరీని కేవలం 15 పరుగుల తేడాతో మిస్ అయ్యాడు. అయితే త‌న అత్యుత్తమ ప్రపంచ కప్ నాక్‌లలో ఒకదానితో ముందుకు వచ్చాడు. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన 200 పరుగుల ఛేజింగ్‌లో 2 వికెట్ల నష్టానికి 3 వికెట్లు కోల్పోయి భారత్ విజ‌యం సాధించింది. విరాట్ కోహ్లి  ఆరు బౌండరీలతో 4వ వికెట్‌కు కేఎల్ రాహుల్‌తో కలిసి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
 

Latest Videos


Virat Kohli, India, cricket

పూణేలో విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌పై అద్భుతమైన 103 నాటౌట్ (అతని 48వ వన్డే సెంచరీ)తో అద‌ర‌గొట్టాడు. ఆ త‌ర్వాత‌ తన చిన్ననాటి హీరో టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 121 బంతుల్లో 101 నాటౌట్‌తో తన విమర్శకుల నోరు మూయించాడు. ఇప్పుడు టెండూల్కర్‌తో సమానంగా 49 సెంచ‌రీల లిస్టులోకి చేరారు. ఇక వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో మ‌రో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును విరాట్ బ‌ద్ద‌లు కొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో విరాట్ తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో కిటకిటలాడిన క్ష‌ణాల మ‌ధ్య క్రికెట్ దేవుడి ముందు అత్య‌ధిక‌ సెంచ‌రీల రికార్డును బద్దలు కొట్టాడు. అభిమానుల కరతాళ ధ్వనుల్లో తడిసి ముద్దయ్యాడు. తన హీరో టెండూల్కర్‌కు వైపు చూస్తూ నమస్కరించాడు. టెండూల్కర్ కూడా  స్టాండ్స్ నుండి విరాట్‌ను అభినందించాడు.
 

click me!