Jasprit Bumrah-Aiden Markram
IND vs SA Test: భారత-సౌతాఫ్రికా రెండో టెస్టు సెంకండ్ ఇన్నింగ్స్ లో ప్రొటీస్ జట్టు ప్లేయర్లు వరుసగా ఫెవిలియన్ కు క్యూ కట్టగా.. ఐడెన్ మార్క్‌రమ్ మాత్రం తనదైన స్టైల్లో బ్యాటింగ్ లో రాణించి సెంచరీ చేశాడు. 103 బంతులు ఎదుర్కొన్న ఐడెన్ మార్క్‌రమ్ 106 పరుగులతో అదరగొట్టాడు. అతని ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 106 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఐడెన్ మార్క్‌రమ్ తప్ప సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మిగతా ప్లేయర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. దీంతో కేప్ టౌన్ టెస్టులో భారత్ ముందు 79 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఉంచింది.
రెండో రోజు ఆటను 62/3తో ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు లంచ్ సమయానికి 176 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీయగా, ముఖేష్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ లు ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐడెన్ మార్క్‌రమ్ 103 బంతుల్లో 106 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్స్ రాణించలేకపోయారు. తన టెస్టు కెరీర్ లో చివరి మ్యాచ్ అడుతున్న డీన్ ఎల్గర్ 12 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ ముందు 79 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబడ, నాంద్రే బర్గర్, లుంగీ ఎంగిడీ తలో 3 వికెట్లు తీశారు. ఎంగిడీ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు.