ఆ రోజు సచిన్ విషయంలో కూడా మాకు అన్యాయం జరిగింది... పాక్ మాజీ బౌలర్ సయిద్ అజ్మల్...

First Published Jan 15, 2022, 11:15 AM IST

డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ బాల్ ట్రాకింగ్ విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. కెప్టెన్ డీన్ ఎల్గర్ త్వరగా అవుటైతే, తమ జట్టు ఓడిపోతుందనే భయంతో సౌతాఫ్రికా ఛీటింగ్ చేసిందని కూడా విమర్శలు వచ్చాయి...

థర్డ్ అంపైర్‌పై, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించిన విధానంపై స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి మరీ కామెంట్లు చేశారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, కెఎల్ రాహుల్...

ఆ బాల్ వికెట్లను మిస్ అయ్యే ఛాన్సే లేదని, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడారంటూ టీమిండియా ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది...

అయితే డీన్ ఎల్గర్ అవుట్ విషయంలో రేగిన వివాదం కాస్త భారత్, పాక్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదానికి తెర లేపినట్టైంది. దీనికి కారణం 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్...

2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (38) వికెట్ త్వరగా కోల్పోయింది. ఆ తర్వాత సయ్యద్ అజ్మల్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్...

అయితే సచిన్ టెండూల్కర్ వెంటనే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బాల్ ట్రాకింగ్‌ బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు చూపించింది.. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది...

అలా లైఫ్ దక్కించుకున్న సచిన్ టెండూల్కర్ 115 బంతుల్లో 11 ఫోర్లతో 85 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేయగా, పాకిస్తాన్ 231 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

‘ఏదైనా నిర్ణయం మనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడే అందులో పారదర్శకత గురించి అనుమానాలు వస్తాయి. ఇప్పడు టీమిండియా పరిస్థితి కూడా అదే...

2011 వన్డే వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్‌కి నేను వేసిన బంతి విషయంలోనూ ఇదే జరిగింది. అశ్విన్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్ నాటౌట్‌గా తేలడంతో ఆశ్చర్యపోయినట్టే, నేను అప్పుడు షాక్ అయ్యాను... ’ అంటూ కామెంట్ చేశాడు సయ్యద్ అజ్మల్...

ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు హర్భజన్ సింగ్ వికెట్ తీసిన సయ్యద్ అజ్మల్, 2014లో బౌలింగ్ యాక్షన్ సరిగా లేని కారణంగా నిషేధానికి గురయ్యాడు...

click me!