మన బౌలర్లకంటే వాళ్లు పొడవు ఎక్కువ, అందుకే టీమిండియా ఓడింది... గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు...

Published : Jan 08, 2022, 02:14 PM IST

సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో విజయాన్ని అందుకున్న టీమిండియాకి జోహన్‌బర్గ్‌లో షాక్ తగిలింది. జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది సౌతాఫ్రికా...

PREV
110
మన బౌలర్లకంటే వాళ్లు పొడవు ఎక్కువ, అందుకే టీమిండియా ఓడింది... గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు...

భారత జట్టు ఓటమికి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ వైఫల్యమే కారణమని విమర్శలు వినిపించాయి. విరాట్ కోహ్లీ గైర్హజరీలో అజింకా రహానేకి కాకుండా కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించడం... టీమిండియా ఓటమికి దారి తీసిందని ట్రోల్స్ వచ్చాయి...

210

‘భారత జట్టు ఓటమికి నాలుగో సీమర్ అందుబాటులో లేకపోవడం ముఖ్యకారణం. మహ్మద్ సిరాజ్ గాయపడడంతో నూరు శాతం ఫిట్‌గా లేకపోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది...

310

సిరాజ్ ఫిట్‌గా ఉండి ఉంటే, సఫారీ బ్యాట్స్‌మెన్‌కి కచ్ఛితంగా ఇబ్బంది పెట్టేవాడు. వర్షం పడి ఆగిన  తర్వాత తడి బంతితో స్పిన్నర్లు బౌలింగ్ చేయలేరు. వారి పిచ్ సరిగా సహకరించదు...

410

సిరాజ్ గాయపడడంతో ముగ్గురు పేసర్లతోనే ఆడినట్టైంది. ముగ్గురు పేసర్లు, 8 వికెట్లు తీయాలంటే అంత తేలిగ్గా వీలయ్యే పని కాదు. ముగ్గురిలో ఎవరు ఫామ్‌లో లేకున్నా, రిజల్ట్ తేడా కొట్టేస్తుంది...

510

టీమిండియా విషయంలో జరిగింది అదే. సఫారీ పిచ్‌ల మీద వికెట్లు రాబట్టాలంటే షార్ట్ బాల్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది... సౌతాఫ్రికా పేసర్లు అదే చేశారు...

610

భారత బౌలర్లతో పోలిస్తే సౌతాఫ్రికా బౌలర్ల హైట్ ఎక్కువ. కాబట్టి వారి హైట్ కూడా వారికి అడ్వాంటేజ్ అయ్యింది. భారత బౌలర్లు వేసిన బంతులు, వికెట్ కీపర్‌ పైకి వెళ్తున్నాయి...

710

అదే మార్కో జాన్సెన్, కగిసో రబాడా బౌలింగ్ చేస్తే... వాళ్లు వేసే లెంగ్త్ బాల్స్ వికెట్ల హైట్‌కి మించకుండా ఉంటాయి. ఇరుజట్ల బౌలింగ్‌లో ఇదే ముఖ్యమైన తేడా...

810

అన్నింటికీ మించి భారత బ్యాటింగ్ వైఫల్యం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత 202 పరుగులకే ఆలౌట్ అవ్వడం... సౌతాఫ్రికాకి బాగా కలిసి వచ్చింది...

910

సెంచూరియన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది భారత జట్టు, అందుకే రెండో ఇన్నింగ్స్‌లో 200 దాటకపోయినా టీమిండియాకి విజయం దక్కింది. జోహన్‌బర్గ్‌లో మిస్ అయ్యింది అదే...

1010

సిరాజ్ గాయపడిన తర్వాత నాలుగు బౌలర్లే అందుబాటులో ఉన్నప్పుడు ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టాలంటే వారి ముందు కనీసం 300 టార్గెట్ అయినా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

click me!

Recommended Stories