అందుకే నన్ను రిటైన్ చేసుకోలేమని ఆర్‌సీబీ చెప్పింది... పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్...

First Published Jan 8, 2022, 1:31 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసి, పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్. ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన హర్షల్ పటేల్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోకపోవడం విశేషం...

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో పాటు మహ్మద్ సిరాజ్‌ను అట్టిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మిగిలిన ప్లేయర్లను మెగా వేలానికి విడుదల చేసింది...

7 సీజన్లగా పైగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కొనసాగుతున్న యజ్వేంద్ర చాహాల్‌కి ఆర్‌సీబీ రిటెన్షన్‌లో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

అయితే 2021లో ఏకంగా 32 వికెట్లు తీసి, ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో రికార్డును సమం చేశాడు ‘పర్పుల్ క్యాప్’ విన్నర్ హర్షల్ పటేల్...

‘ఐపీఎల్ 2021 సీజన్‌ నాకు చాలా చాలా స్పెషల్. ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి నన్ను ఆర్‌సీబీ ట్రేడ్ చేయడానికి ముందు ఆ జట్టు ఎంతో హోమ్‌వర్క్ చేసింది...

Harshal Patel

నా టాలెంట్‌ని గుర్తించి, ఓ మంచి డెత్ బౌలర్‌గా మారతారని భావించి... ఆర్‌సీబీలోకి తెచ్చుకున్నారు. జట్టులోకి వచ్చాక కూడా అదే చెప్పారు, డెత్ ఓవర్ బౌలింగ్ కోసమే తీసుకున్నట్టు వివరించారు...

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌‌లో నా పేరు ఉండదని నాకు ముందే తెలుసు. ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హుస్సేన్ నాకు కాల్ చేసి విషయం చెప్పారు. పర్స్ మేనేజ్‌మెంట్‌ కోసం నిన్ను రిటైన్ చేసుకోవడం లేదని అన్నారు...

నన్ను వేలంలో తిరిగి తీసుకోవడానికి ఆర్‌సీబీ సిద్ధంగా ఉంది. ఆర్‌సీబీలో ఆడేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఎందుకంటే ఐపీఎల్ 2021 సీజన్ నా కెరీర్ గ్రాఫ్‌, జీవితాన్నే మార్చేసింది...

వేలంలో ఏం జరుగుతుందో చెప్పలేం, ఏ టీమ్‌కి వెళ్లినా నూరు శాతం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నా. జడేజా, నా బౌలింగ్‌లో 37 పరుగులు చేయడాన్ని ఇప్పటికీ మరిచిపోలేదు...

Harshal Patel

అయితే నాకు తెలిసి, ఆ రోజు నేను కొన్ని తప్పులు చేశాను. మొదటి రెండు బంతుల తర్వాత అనవసర ఒత్తిడికి లోనయ్యారు. అదీ కాకుండా ఆ రోజు జడేజా భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు...

అందుకే నేను ఒక్క యార్కర్ కూడా వేయలేకపోయానేమో... అయితే ఆ రోజు చేసిన తప్పు, మళ్లీ రిపీట్ కాకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాను... 

ఆ ఒక్క ఓవర్ కారణంగా నేను చెడ్డ బౌలర్‌ని అయిపోను... అప్పటికే ఆ మ్యాచ్‌లో నేను మూడు వికెట్లు తీశా...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్షల్ పటేల్...

click me!