మీ రాజకీయాల కోసం టీమ్‌ని బలి చేస్తారా... అజింకా రహానే ఉండగా, కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఎందుకిచ్చారు...

First Published Jan 8, 2022, 12:37 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నుంచి భారత క్రికెట్ బోర్డులో పరిస్థితులు సరిగా లేవని క్రికెట్ ఫాలోఅయ్యే వారందరికీ క్లియర్‌గా అర్థం అవుతోంది. మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీని నియమించడం, కీలక మ్యాచుల్లో అనవసర ప్రయోగాలు చేయడం వంటివి భారత జట్టు ప్రదర్శనను తీవ్రంగా దెబ్బతీశాయి...

విరాట్ కోహ్లీని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆ తర్వాత అజింకా రహానే ఫామ్‌లో లేడనే ఉద్దేశంతో అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

అజింకా రహానే స్థానంలో రోహిత్ శర్మను టెస్టు వైస్ కెప్టెన్‌గా ఎంచుకుంది. అంతవరకూ బాగానే ఉంది. గత ఏడాది 900+ టెస్టు పరుగులు చేసిన రోహిత్‌కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు అభిమానులు...

అయితే రోహిత్ శర్మ గాయం నుంచి తప్పుకున్న తర్వాత ఏ మాత్రం కెప్టెన్సీ లక్షణాలు లేని కెఎల్ రాహుల్‌కి వైస్ కెప్టెన్‌గా నియమించడం తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమైంది...

టెస్టు కెప్టెన్‌గా అజింకా రహానేకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఐదు టెస్టుల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన అజింకా రహానే, మూడు మ్యాచుల్లో విజయాలు అందించాడు. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి...

‘టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అజింకా రహానే లాంటి టెస్టు కెప్టెన్ అందుబాటులో ఉన్నప్పుడు అతన్ని పక్కనబెట్టి, కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఎందుకిచ్చారు...

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచిన అజింకా రహానే, తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. ఫామ్‌లో లేకపోయినా జట్టును నడిపించగలడు. ఆ విషయంలో ఎవ్వరికీ సందేహాలు లేవు...

కెఎల్ రాహుల్‌కి పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండొచ్చు. చాలామంది టీమిండియాకి కాబోయే సారథి అతనేనని అనుకుంటున్నారు కూడా... టెస్టుల్లో జట్టును నడిపించడం అంత తేలికైన విషయం కాదు...

అది కూడా సౌతాఫ్రికాలో సఫారీ జట్టుపై ఆడుతున్నప్పుడు అనుభవం ఉన్న అజింకా రహానే లాంటి కెప్టెన్‌ సేవలు వాడుకుని ఉంటే బాగుండేది....

విరాట్ కోహ్లీ లేకపోతే రాజకీయాలకు తావు లేకుండా రహానేయే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాలి. ఎందుకంటే విరాట్ లేని లోటు తెలియకుండా జట్టును ఎలా నడిపించాలో రహానేకి బాగా తెలుసు...

జోహన్‌బర్గ్ టెస్టులో టీమిండియాలో మిస్ అయ్యింది అదే... విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీని టీమ్ మిస్ అయ్యింది. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఎనర్జీ కనిపించలేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

click me!