ఏడాది క్రితం కెప్టెన్, ఇప్పుడేమో టీమ్‌లో కూడా లేడు... శిఖర్ ధావన్‌ని ఎంపిక చేయకపోవడంపై...

Published : Jun 14, 2022, 01:58 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 సీజన్‌కి టీమ్‌ని సిద్ధం చేసేందుకు సన్నాహకంగా సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ని చూస్తోంది బీసీసీఐ. అందుకే ఈ సిరీస్‌కి సంజూ శాంసన్, శిఖర్ ధావన్ వంటి సీనియర్లను ఎంపిక చేయలేదు. అయితే టీమిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

PREV
18
ఏడాది క్రితం కెప్టెన్, ఇప్పుడేమో టీమ్‌లో కూడా లేడు... శిఖర్ ధావన్‌ని ఎంపిక చేయకపోవడంపై...
Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు, కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంచుకున్నారు. అయితే రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో గైక్వాడ్, ఇషాన్ కిషన్ కలిసి ఓపెనర్లుగా వ్యవహరిస్తున్నారు...

28

ఐపీఎల్‌లో వరుసగా 500+లకు పైగా పరుగులు చేస్తూ ఆకట్టుకుంటున్న శిఖర్ ధావన్, టీ20 జట్టులో చోటు మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. ధావన్‌ని టీమ్‌కి సెలక్ట్ చేయకుండా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అడ్డుపడ్డారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే...

38

‘టీ20 వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్‌ని ఆడించాలని అనుకుంటే, సౌతాఫ్రికా సిరీస్‌కి ఎంపిక చేసేవాళ్లు. లేదు కాబట్టి అతన్ని తీసి పక్కనబెట్టారు. అయితే ఎవరి సెలక్షన్ అయినా వారి పర్ఫామెన్స్ మీద ఆధారపడి జరగాలి. అదే న్యాయం...

48
Image Credit: Getty Images

శిఖర్ ధావన్ సెలక్షన్ మాత్రం అలా జరగడం లేదు. గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినా అతన్ని పట్టించుకోవడం లేదు. అదీకాకుండా గత ఏడాది లంకలో పర్యటించిన భారత జట్టుకి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉన్నాడు...

58
Shikhar Dhawan

ఏడాది క్రితం కెప్టెన్‌గా ఉన్నవాడికి ఇప్పుడు జట్టులో ప్లేస్ కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అతను పనికి వస్తాడా? లేదా? అని తేల్చడానికి కొన్ని వరుస అవకాశాలు ఇవ్వాలి. టీ20 వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్‌ని ఆడించకూడదని అనుకున్నా, సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడిస్తే తప్పేంటి?

68

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు దూరమైనప్పుడు శిఖర్ ధావన్ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. అతనికి కెప్టెన్సీ ఇవ్వడం కూడా కరెక్ట్‌గా ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

78

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న టీమిండియా మేనేజ్‌మెంట్, శిఖర్ ధావన్‌ని కావాలని పక్కనబెట్టిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

88

ఐపీఎల్‌లో వరుసగా మూడు సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన శిఖర్ ధావన్‌‌కి ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ధావన్‌ని అందుకే ‘మ్యాన్ ఆఫ్ ఐసీసీ టోర్నీస్’ అని కూడా పిలుస్తారు...

Read more Photos on
click me!

Recommended Stories