Published : Jun 14, 2022, 01:13 PM ISTUpdated : Jun 14, 2022, 01:16 PM IST
టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? కొన్నాళ్ల క్రితం వరకూ భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఒక్కడి పేరే వినిపించింది. అయితే అతను గాయపడి, ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి దూరం కావడంతో సమీకరణాలు మొత్తం మారిపోయి, పోటీ విపరీతంగా పెరిగిపోయింది...
మూడు ఫార్మాట్లలో నిలకడగా పర్పామెన్స్ ఇస్తున్న బ్యాటర్ కెఎల్ రాహుల్‌ని టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా చూస్తున్నారు సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్. అందుకే సౌతాఫ్రికా టూర్‌లో కెఎల్ రాహుల్‌కి టెస్టు, వన్డే కెప్టెన్సీ అప్పగించారు...
27
స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌కి కూడా తొలుత కెఎల్ రాహుల్‌నే కెప్టెన్‌గా ఎంచుకున్నారు సెలక్టర్లు. అయితే మొదటి మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు గాయంతో కెఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమైనట్టు ప్రకటన వచ్చింది...
37
రిషబ్ పంత్ మొదటి రెండు మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోవడంతో శ్రేయాస్ అయ్యర్‌కి లేదా హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ అప్పగించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అభిమానులు...
47
‘కెఎల్ రాహుల్ కంటే హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ అప్పగించడం కరెక్ట్ నిర్ణయం. ఎందుకంటే అతను ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సత్తా చాటాడు. తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచి, కెప్టెన్‌గా ఏం చేయగలనో నిరూపించుకున్నాడు...
57
అన్నింటికీ మించి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకని ముందుండి నడిపించే లక్షణం హార్ధిక్ పాండ్యాలో ఉంది. బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ అదరగొట్టగలడు. ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించగలడు...
67
ముఖ్యంగా ఫైనల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసి మ్యాచులు ఎలా గెలవాలో హార్ధిక్ పాండ్యాకి బాగా తెలుసు. మొదటి బంతి నుంచి బౌండరీలు బాదుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టగలడు... ఈ లక్షణాలు అందరిలోనూ ఉండవు...
77
తొందర వికెట్లు పడితే బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి వచ్చి బాధ్యత తీసుకుని ఆడగల లక్షణం హార్ధిక్ పాండ్యా స్పెషాలిటీ... ప్రస్తుత టీ20 క్రికెట్‌లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్లలో హార్ధిక్ పాండ్యా ఒకడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్...