టీమిండియాకి ఊహించని షాక్... టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గాయంతో కెఎల్ రాహుల్ అవుట్...

First Published Nov 23, 2021, 3:54 PM IST

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి, టెస్టు సిరీస్ కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు...

జూన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ తర్వాత ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయపడడంతో అతని స్థానంలో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు కెఎల్ రాహుల్...

ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లోనే 84 పరుగులు చేసి ఆకట్టుకున్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మతో కలిసి నాలుగు టెస్టుల్లోనూ ఓపెనింగ్ చేశాడు...

కెఎల్ రాహుల్ రాణించడం వల్ల తొలుత ఓపెనర్‌గా ఆడించాలని భావించిన మయాంక్ అగర్వాల్‌కి ఇంగ్లాండ్ టూర్‌లో అసలు అవకాశమే దక్కలేదు.

తాజాగా కాన్పూర్ వేదికగా జరిగే ఇండియా, న్యూజిలాండ్ తొలి టెస్టుకి ముందు మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ గాయపడ్డాడు... 

కెఎల్ రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపి, శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని భావించింది టీమిండియా. అయితే కెఎల్ రాహుల్ గాయపడడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది...

మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్‌లను ఓపెనర్లుగా పంపించి, మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, లేదా సూర్యకుమార్ యాదవ్‌లను ఆడించే అవకాశం ఉంటుంది...

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్లని సూర్యకుమార్ యాదవ్, కాన్పూర్‌లో టీమిండియాతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాడు...

అయితే సూర్యకుమార్ యాదవ్‌ను టెస్టు టీమ్‌లో జత చేసినట్టుగా ఇప్పటివరకూ ప్రకటించలేదు బీసీసీఐ. కెఎల్ రాహుల్ గాయం గురించి స్పష్టమైన క్లారిటీ రావడంతో ఇప్పుడు యాదవ్‌, టెస్టు టీమ్‌లో కలవనున్నాడు...

రోహిత్ శర్మకు ఈ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. రోహిత్‌తో పాటు రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఈ టెస్టు సిరీస్‌కి దూరంగా ఉంటున్నాడు...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టు నుంచి టీమ్‌తో కలవబోతుంటే, మొదటి టెస్టుకి అజింకా రహానే సారథిగా వ్యవహరించబోతున్నాడు..

click me!