Covid Strikes BCCI: బీసీసీఐపై పంజా విసురుతున్న కరోనా.. ముంబైలోని ప్రధాన కార్యాలయానికి తాళాలు..

Published : Jan 07, 2022, 03:14 PM IST

BCCI SHUT DOWN: మొన్న బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి కరోనా.. నిన్న రంజీ సీజన్ రద్దు.. నేడు  బీసీసీఐ ఆఫీస్ కే తాళాలు.. భారత క్రికెట్ బోర్డుపై కరోనా కరాళనృత్యానికి ఇవే సాక్ష్యాలు.. 

PREV
17
Covid Strikes BCCI: బీసీసీఐపై పంజా విసురుతున్న కరోనా.. ముంబైలోని ప్రధాన కార్యాలయానికి తాళాలు..

దేశంలో వీర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి షాకిచ్చింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో పలువురికి కరోనా పాజిటివ్ సోకింది. 

27

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న విషయం తెలిసిందే. గురువారం ఒక్కరోజే ముంబైలో ఏకంగా 20వేలకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

37

బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ  వ్యాపారవేత్తలతో పాటు ఎంతో మంది సాధారణ ప్రజలు దీని బారిన పడుతున్నారు. తాజాగా.. కరోనా ప్రపంచంలోనే అత్యంత ధనవంత బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐపై పంజా విసిరింది. ముంబైలో ఉన్న బీసీసీఐ ప్రధాన కర్యాలయంలో ముగ్గురు  వ్యక్తులకు పాజిటివ్ గా  తేలింది. 

47

బీసీసీఐ సెంట్రల్ ఆఫీస్ లోని క్రికెట్ కార్యకలాపాలు చూసే ఓ వ్యక్తితో పాటు ఆర్థిక వ్యవహారాలు చూసుకునే మరో ఇద్దరికీ పాజిటివ్ గా తేలింది.

57

దీంతో బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేసినట్టు తెలుస్తున్నది. బీసీసీఐతో పాటు వాంఖడే క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్  లోని పలువురు సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ ప్రధాన కార్యాలయాలన్నీ మూడు రోజుల పాటు మూతపడ్డాయని  బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపాడు.

67

ఇదిలాఉండగా.. ఇప్పటికే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తో పాటు అతడి కూతురు కూడా  కొవిడ్-19 పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.  వీళ్లిద్దరూ ఇప్పుడు  ఐసోలేషన్ లో ఉన్నారు. 

77

దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈనెల 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న రంజీ సీజన్ ను కూడా  బీసీసీఐ వాయిదా వేసింది. రంజీ లతో పాటు సీకే నాయుడు టోర్నీ, మహిళల టీ20 టోర్నీలనూ వాయిదా వేసింది.

click me!

Recommended Stories