Hardik Pandya: కెప్టెన్ గా తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జట్టుకు ట్రోఫీని అందించిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా తాజాగా తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో వెల్లడించాడు.
సాధారణంగా నైంటీస్ కిడ్స్ కు ఫేవరేట్ క్రికెటర్ ఎవరంటే టక్కున గుర్తుకొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయంగా చూస్తే అదే కాలంలో ఓ వెలుగు వెలిగిన బ్రియాన్ లారా, జాక్వస్ కలిస్, స్టీవ్ వా వంటి ఆటగాళ్ల పేర్లు చెబుతారు.
28
కానీ టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పేవరేట్ క్రికెటర్ పైన పేర్కొన్న వాళ్లెవరూ కాదంటున్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్లుగా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లి వంటి వాళ్లు కూడా కాదంటున్నాడు.
38
పాండ్యాకు భాగా నచ్చిన ఆటగాడు టీమిండియా మాజీ ఓపెనర్, విదర్భ క్రికెటర్ వసీం జాఫర్. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
48
హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నాకు కూడా జాక్వస్ కలిస్, సచిన్, విరాట్ ల ఆటంటే చాలా ఇష్టం. వీళ్లే గాక చాలా మంది దిగ్గజాల ఆటను నేను ఇష్టపడతాను. కానీ నా ఫేవరేట్ క్రికెటర్ మాత్రం వసీం జాఫర్.
58
జాఫర్ బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. జాఫర్ లెజెండరీ క్రికెటర్. పలు సందర్భాల్లో నేను కూడా జాఫర్ బ్యాటింగ్ స్టైల్ ను కాపీ కొడదామనుకున్నా. కానీ నేను అతడి క్లాస్ ను అందుకోలేకపోయా...’ అని తెలిపాడు.
68
భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్.. 1,944 పరుగులు చేశాడు. అప్పటికే భారత జట్టులో సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, ద్రావిడ్, గంగూలీ వంటి దిగ్గజాలు ఉండటంతో జాఫర్ కు జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు.
78
అయినా తనకు వచ్చిన అవకాశాలను జాఫర్ సద్వినియోగం చేసుకున్నాడు. తాను ఆడిన 31 టెస్టులలో 11 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 212 గా ఉంది.
88
జాతీయ జట్టులో జాఫర్ కు అంతగా గుర్తింపు దక్కకపోయినా దేశవాళీలో మాత్రం జాఫర్ టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. 260 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో ఏకంగా 19,410 పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలున్నాయి. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఘనత సాధించాడు.