సౌతాఫ్రికా టూర్‌లో ఇషాంత్ శర్మకు ప్లేస్ ఉండకపోవచ్చని అనుకున్నారు క్రికెట్ విశ్లేషకులు. అయితే 33 ఏళ్ల ఇషాంత్ శర్మకు సఫారీ టూర్‌కి ప్రకటించిన జట్టులో చోటు దక్కడంతో ఇదే అతనికి ఆఖరి సిరీస్ కావచ్చని కూడా వార్తలు వినిపించాయి...
గత ఏడాది కాలంగా గాయాలతో బాధపడుతున్న ఇషాంత్ శర్మ, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణించలేకపోయాడు...
212
కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయిన ఇషాంత్ శర్మ, గాయం కారణంగా రెండో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
312
భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ తర్వాత 100కి పైగా టెస్టులు ఆడిన రెండో భారత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఇషాంత్ శర్మ, ప్రస్తుతం 105 టెస్టుల్లో 311 వికెట్లు పడగట్టాడు...
412
టీమిండియా తరుపున 300+ టెస్టు వికెట్లు తీసిన ఆరో బౌలర్ ఇషాంత్ శర్మ. ఇంతకుముందు అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...
512
‘మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్టుకి దూరమైనప్పుడు అతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు చోటు దక్కుతుందని అనుకున్నా... కానీ ఉమేశ్ యాదవ్‌కి చోటు దక్కింది...
612
ఉమేశ్ యాదవ్ బ్రిలియెంట్ బౌలర్. అయితే ఇషాంత్ శర్మ ఇప్పటికే 100కి పైగా టెస్టులు ఆడాడు. అంత అనుభవం ఉన్న బౌలర్‌కి ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలోనూ చోటు దక్కకపోవడం దారుణం...
712
కెరీర్ చివరి దశలో ఉన్న ఇషాంత్ శర్మకు ఇలాంటి పరిణామాలు పెద్దగా నచ్చకపోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..
812
‘ఇషాంత్ శర్మకి తుది జట్టులో చోటు దక్కి ఉంటే బాగుండేది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అందరూ పరుగులు సమర్పించారు, బుమ్రాతో సహా...
912
అలాంటి సమయంలో సౌతాఫ్రికా బ్యాటర్ల సహనానికి పరీక్ష పెట్టే అనుభవం ఇషాంత్ శర్మ సొంతం... అందుకే అతనికి చోటు ఇవ్వాల్సింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...
1012
‘ఐదుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు దక్కిన తర్వాత 100 టెస్టులకు పైగా అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ తుదిజట్టులోకి రాకపోవడం అతన్ని అవమానించడమే...
1112
అయితే అతనికి ఎందుకు చోటు ఇవ్వలేదో క్లియర్‌గా చెప్పాలి. నూరు టెస్టుల అనుభవం ఉన్న సీనియర్‌కి గౌరవం ఇవ్వాలి... సౌతాఫ్రికాలో లెఫ్ట్ హ్యాండర్లు ఉండడం వల్లే ఇషాంత్‌కి చోటు దక్కలేదనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పోలాక్...
1212
వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఆడిన తర్వాత ఇషాంత్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి...