ఆ ఇద్దరినీ తీసి పక్కనపెట్టేయండి, టెస్టు టీమ్‌లో మార్పులు అవసరం... సునీల్ గవాస్కర్...

First Published Jan 15, 2022, 10:34 AM IST

సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియాని వెంటాడిన సమస్య మిడిల్ ఆర్డర్ వైఫల్యం. సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...

మూడు టెస్టుల్లో కలిపి అజింకా రహానే ఓ హాఫ్ సెంచరీతో 136 పరుగులు చేయగా, సీనియర్ మోస్ట్ టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 124 పరుగులు మాత్రమే చేశాడు...

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పూజారా గోల్డెన్ డకౌట్ అయితే, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అజింకా రహానే గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...

కీలకమైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పూజారా 9, అజింకా రహానే 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం భారత జట్టు ఓటమికి కారణమైంది...

‘శ్రేయాస్ అయ్యర్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుని సెంచరీ చేశాడు. ఆ సిరీస్‌లో మిడిల్ ఆర్డర్‌లో చక్కగా రాణించాడు...

అజింకా రహానే వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అతనితో పాటు పూజారా కూడా పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఆ ఇద్దరినీ ఇక తీసి పక్కనబెట్టేయాల్సిందే...

శ్రీలంకతో జరిగే సిరీస్‌లో ఈ ఇద్దరిని సెలక్ట్ చేయకపోవడమే మంచిది. వీరి స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలకు అవకాశం ఇస్తే జట్టుకి మంచిది...

మూడో స్థానంలో ఎవరు ఆడతారనేది కూడా ముఖ్యమే. హనుమ విహారికి ఛతేశ్వర్ పూజారా ప్లేస్, శ్రేయాస్ అయ్యర్‌ని అజింకా రహానే ఐదో స్థానంలో ఆడిస్తే మంచిది...

శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయనే అనుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

click me!