రోహిత్ శర్మ రికార్డులకి బ్రేక్... గత ఏడాది విరాట్ కోహ్లీకి, ఈ ఏడాది హిట్ మ్యాన్ రికార్డుకి బ్రేక్...

Published : Dec 23, 2021, 02:42 PM IST

భారత వన్డే సారథిగా బాధ్యతలు తీసుకోబోతున్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, వన్డేల్లో సెంచరీ లేకుండానే ఈ ఏడాదిని ముగించనున్నాడు. గత 8 ఏళ్లుగా కనీసం ఓ వన్డే సెంచరీ చేస్తూ వస్తున్న రోహిత్ రికార్డుకి ఈ ఏడాదితో బ్రేక్ పడనుంది..

PREV
112
రోహిత్ శర్మ రికార్డులకి బ్రేక్... గత ఏడాది విరాట్ కోహ్లీకి, ఈ ఏడాది హిట్ మ్యాన్ రికార్డుకి బ్రేక్...

టీ20ల ఎంట్రీ తర్వాత వన్డేలకు ప్రాధాన్యం భారీగా తగ్గిపోయింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగాల్సిన వన్డే సిరీస్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ఈ ఏడాది కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడింది భారత జట్టు...

212

అందులో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడగా, శ్రీలంకలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మూడు వన్డేలు ఆడింది భారత జట్టు. ఇందులో ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన రోహిత్ శర్మ, అందులో మూడు మ్యాచుల్లో కలిపి 90 పరుగులే చేయగలిగాడు...

312

గత ఏడాది ఆస్ట్రేలియాతో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో 119 పరుగులు చేసిన రోహిత్ శర్మ, 2013 నుంచి వరుసగా 8 ఏళ్లుగా ప్రతీ ఏటా వన్డే సెంచరీ చేస్తూ వచ్చాడు... ఈ లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ...

412

1994 నుంచి 2012 వరకూ ప్రతీ ఏడాది కనీసం ఓ వన్డే సెంచరీ చేస్తూ వచ్చిన భారత మాజీ క్రికెటర్, ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్... వరుసగా 19 ఏళ్లు సెంచరీతో ముగించి... అందరి కంటే టాప్‌లో నిలిచాడు...

512

విరాట్ కోహ్లీ గత ఏడాది, రోహిత్ శర్మ ఈ ఏడాది మూడు వన్డేలు మాత్రమే ఆడి సెంచరీ మార్కు అందుకోలేకపోతే... 2010లో కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడిన సచిన్ టెండూల్కర్... ఓ మ్యాచ్‌లో సెంచరీ అందుకోవడం విశేషం.

612

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ నాథన్ అస్టెల్ 1995 నుంచి 2006 వరకూ వరుసగా 12 ఏళ్ల పాటు వన్డే సెంచరీలు బాది... సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

712

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షల్ గిబ్స్ 1999 నుంచి 2010 వరకూ వరుసగా 11 ఏళ్లు వన్డే సెంచరీలు చేశాడు. వరుసగా అత్యధిక ఏళ్ల పాటు వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా టాప్‌ 3లో నిలిచాడు హర్షల్ గిబ్స్...

812

2009 నుంచి 2019 వరకూ వరుసగా 11 ఏళ్లు వన్డే సెంచరీ చేస్తూ వచ్చిన విరాట్ కోహ్లీ, హర్షల్ గిబ్స్‌తో కలిసి టాప్‌ 3లో ఉన్నాడు. గత ఏడాది 3 వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు...

912

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ 2009 నుంచి 2017 వరకూ వరుసగా 9 ఏళ్ల పాటు వన్డేల్లో శతాధిక స్కోర్లను నమోదు చేసి టాప్ 4లో నిలిచాడు...

1012

2013 నుంచి 2020 వరకూ వన్డేల్లో సెంచరీ మార్కు అందుకున్న వచ్చిన రోహిత్ శర్మకు ఈ ఏడాది బ్రేక్ పడింది. వరుసగా 8 ఏళ్లు వన్డేల్లో సెంచరీ మార్కు అందుకున్న రోహిత్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా, పాక్ మాజీ క్రికెటర్ సయ్యద్ అన్వర్‌లతో కలిపి టాప్ 5లో ఉన్నాడు...

1112

అలాగే ఈ ఏడాది వన్డేల్లో కేవలం 30 సగటుతో పరుగులు చేసిన రోహిత్ శర్మ, వరుసగా 8 ఏళ్లుగా వన్డేల్లో 50+ సగటుతో పరుగులు చేస్తున్న రికార్డును కూడా అందుకోలేకపోయాడు...

1212

2013 నుంచి 2020 వరకూ వన్డేల్లో 50+ సగటుతో పరుగులు చేస్తూ వచ్చిన రోహిత్ శర్మ, ఈ లిస్టులో అందరి కంటే ముందున్నాడు. ఏబీ డివిల్లియర్స్ వరుసగా ఏడేళ్లు, విరాట్ కోహ్లీ, ధోనీ, జో రూట్ నాలుగేళ్లు ఈ ఫీట్ సాధించారు. 

Read more Photos on
click me!

Recommended Stories