ఒకే దెబ్బకు రెండు పిట్టలు... టీ20 వరల్డ్ కప్ 2022 ముందు రోహిత్ శర్మ రికార్డు ఫీట్...

First Published Oct 3, 2022, 11:14 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు రోహిత్ శర్మ కెప్టెన్‌గా రికార్డులను బ్రేక్ చేస్తూ వెళ్తున్నాడు. ఆసియా కప్ 2022లో పేలవ ప్రదర్శన తర్వాత  ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గిన టీమిండియా, అదే ఊపును కొనసాగించి సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ కూడా నెగ్గేసింది. బౌండరీల వర్షం కురిసిన గౌహతి టీ20లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రెండు అరుదైన రికార్డులు క్రియేట్ చేశాడు...

Image credit: PTI

స్వదేశంలో సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ నెగ్గిన భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు ఎంఎస్ ధోనీ, సౌతాఫ్రికా చేతుల్లో టీ20 సిరీస్‌లు ఓడిపోగా, విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు 1-1 తేడాతో సిరీస్ సమం చేసుకోగలిగింది. వర్షం కారణంగా మూడో టీ20 ఫలితం తేలలేదు. ఈ ఏడాదిలోనే రిషబ్ పంత్ కూడా ఇదే విధంగా సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలిచే రికార్డును తృటిలో మిస్ అయ్యాడు...

Rohit Sharma

రిషబ్ పంత్ కెప్టెన్సీలో తొలి రెండు మ్యాచులు ఓడిపోయిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గింది. సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మిస్ అయిన దాన్ని రోహిత్ శర్మ సాధ్యం చేసి చూపించాడు...

Rohit Sharma

కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది 50వ విజయం. అత్యంత వేగంగా 50 విజయాలు అందుకున్న సారథిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. రోహత్ 62 మ్యాచుల్లో 50 విజయాలు అందుకుంటే విండీస్ మాజీ దిగ్గజం క్లెయివ్ లార్డ్, ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ ఇద్దరూ కూడా 63 మ్యాచుల్లో 50 విజయాలు అందుకుని రెండో స్థానంలో ఉన్నారు...

సౌతాఫ్రికాతో రెండో టీ20లో 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో సూర్య సగటు 40కి పైగా ఉండగా స్ట్రైయిక్ రేటు 174+కి పైగా ఉంది...

Image credit: PTI

1000 టీ20 అంతర్జాతీయ పరుగులను అందుకునేందుకు కేవలం 573 బంతులను వాడిన సూర్యకుమార్ యాదవ్, బంతుల వారీగా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. 2022లో 22 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 185 స్ట్రైయిక్ రేటుతో 793 పరుగులు చేశాడు...

click me!