విరాట్ కోహ్లీ మోస్ట్ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్, అలాగే సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా. అయితే విరాట్ కోహ్లీని ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ ఒక్కటే... టాస్ గెలవడంలో బ్యాడ్‌లక్...
విరాట్ కోహ్లీ పుట్టినరోజు (నవంబర్ 5)న జరిగిన స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు వరుసగా 6 మ్యాచుల్లో టాస్ ఓడిపోయాడు...
210
టాస్ గెలిచిన జట్టుకే దాదాపు విజయం దక్కిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో అదృష్టం విరాట్‌ని వరించి ఉంటే... టీమిండియా రిజల్ట్ వేరేగా ఉండేది...
310
వరుసగా టాస్‌లు ఓడిపోతాడనే అపవాదుని మోసి, టాస్ ఎలా గెలవాలో కోచింగ్ తీసుకోవాలని ట్రోలింగ్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ... వరుసగా నాలుగు మ్యాచుల్లో టాస్ గెలవడం విశేషం...
410
స్కాట్లాండ్, నమీబియాలతో మ్యాచుల్లో టాస్ గెలిచిన విరాట్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ముంబై టెస్టులోనూ టాస్ గెలిచాడు.
510
సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలవడం ద్వారా విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది...
610
టెస్టు క్రికెట్‌లో అత్యధికసార్లు టాస్ గెలిచిన భారత కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ. 47 టెస్టుల్లో 29 సార్లు టాస్ గెలిచిన భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను విరాట్ అధిగమించాడు...
710
విరాట్ కోహ్లీ 68 టెస్టుల్లో 30 సార్లు టాస్ గెలిస్తే, ఎమ్మెస్ ధోనీ 60 టెస్టుల్లో 26 సార్లు టాస్ గెలిచి... మూడో స్థానంలో ఉన్నాడు...
810
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ప్రతీసారీ భారత జట్టుకి విజయం వరించింది.
910
ఇంతకుముందు ఏడు సార్లు (2015లో మూడు సార్లు, 2018లో ఓ మ్యాచ్, 2019లో మూడు టెస్టుల్లో) టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న మ్యాచుల్లో టీమిండియాకి విక్టరీ లభించింది...
1010
టాస్ గెలిచిన అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ... ‘విదేశాల్లో విజయాలు అందుకోవడం గత పర్యటనలో ఇక్కడి నుంచి మొదలైంది. అప్పుడు సిరీస్ ఓడిపోయాకే విదేశాల్లో ఎలా ఆడాలో తెలుసుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు...