రోహిత్ శర్మ చేసిన తప్పునే కొనసాగించిన కెఎల్ రాహుల్... వెంకటేశ్ అయ్యర్ రూపంలో...

First Published Jan 19, 2022, 7:16 PM IST

కపిల్‌దేవ్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత భారత జట్టుకి సరైన పేస్ ఆల్‌రౌండర్ లేడు. హార్ధిక్ పాండ్యా కొన్నాళ్లు టీమిండియాలో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగినా, గాయం కారణంగా ఆ ఫామ్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇప్పుడు వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఓ స్టార్ ఆల్‌రౌండర్‌ను తయారుచేసుకునే అవకాశం దొరికినా, సరిగా వాడుకోవట్లేదు టీమిండయా...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చి, అందరి దృష్టినీ ఆకర్షించాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్... 

మనోడి పర్ఫామెన్స్ చూసి, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి నెట్‌ బౌలర్‌గా ఎంపిక చేశారు సెలక్టర్లు. నెట్ బౌలర్‌గా కాదు, హార్ధిక్ ప్లేస్‌లో ఆడించి ఉంటే బాగుండేదని అన్నారు అభిమానులు...

హార్ధిక్ పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకుని, బౌలింగ్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి కాస్త సమయం కావాలని కోరుకోవడంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు వెంకటేశ్ అయ్యర్...

ఐపీఎల్‌లో 130-140కి.మీ.ల వేగంతో బంతులు విసిరిన వెంకటేశ్ అయ్యర్‌కి మొదటి రెండు టీ20ల్లో ఒక్కటంటే ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ...

మూడో మ్యాచ్‌లో ఎట్టకేలకు బంతిని అందుకున్న వెంకటేశ్ అయ్యర్, మూడో ఓవర్లలో 12 పరగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు...

ఆ తర్వాత కూడా అయ్యర్‌ బౌలింగ్‌పై కెఎల్ రాహుల్‌కి నమ్మకం కలిగినట్టు లేదు. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కి ఎంపికయ్యాడు వెంకటేశ్ అయ్యర్...

తొలి వన్డేలోనే ఆరంగ్రేటం కూడా చేసేశాడు. అయితే వన్డే మ్యాచ్‌లో కూడా వెంకటేశ్ అయ్యర్‌కి ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు నయా కెప్టెన్ కెఎల్ రాహుల్...

శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు సమర్పిస్తున్నా, భువనేశ్వర్ కుమార్ ఇంతకుముందటి రిథమ్ అందుకోలేకపోతున్నా... ఆ ఇద్దరినే బౌలింగ్‌ కొనసాగించాడు...

ఐదుగురు బౌలర్లతో కోటా మొత్తం పూర్తి చేయాలని, అదనంగా బౌలింగ్ ఆప్షన్ ఉన్నా... అత్యవసరమై ఎవరైనా గాయపడితే తప్ప అతన్ని వినియోగించుకోకూడదనట్టుగా ఉంది రాహుల్ అండ్ రోహిత్ కెప్టెన్సీ...

భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు ఇస్తూ వికెట్లు తీయలేనప్పుడు వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆల్‌రౌండర్‌కి నాలుగైదు ఓవర్లు ఇస్తే బాగుండేది... జట్టులో ఆల్‌రౌండర్ ఉండేది కూడా అందుకే...

అయితే అప్పుడు రోహిత్ శర్మ కానీ, ఇప్పుడు కెఎల్ రాహుల్ కానీ వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకున్నది కేవలం హిట్టింగ్ కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం విశేషం...

click me!