విరాట్ కోహ్లీ అసలైన వారసుడు రిషబ్ పంతే... వీరూ నుంచి ధావన్ దాకా 8 మందిలో...

First Published Jun 10, 2022, 5:51 PM IST

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని నడిపించిన విధానంతో క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించి... లక్కీగా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్నాడు రిషబ్ పంత్. రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడం, కెఎల్ రాహుల్ గాయం కారణంగా సిరీస్ ఆరంభానికి ముందు తప్పుకోవడంతో కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు రిషబ్ పంత్...

Rishabh Pant

24 ఏళ్ల 248 రోజుల వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రిషబ్ పంత్, సురేష్ రైనా (23 ఏళ్ల 197 రోజులు) తర్వాత అతి పిన్న వయసులో భారత సారథ్య బాధ్యతలు అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు...  

Virender Sehwag

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో స్కాట్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని బాల్ అవుట్ విధానంలో ఓడించింది టీమిండియా...

Latest Videos


Image credit: PTI

ఎమ్మెస్ ధోనీ తర్వాత టీమిండియాకి టీ20ల్లో కెప్టెన్లుగా వ్యవహరించిన సురేష్ రైనా, అజింకా రహానే... తమ తొలి మ్యాచుల్లో విజయాలు అందుకున్నారు.. టీ20ల్లో మొదటి మ్యాచ్‌లో పరాజయం అందుకున్న తొలి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... 

2017లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20 కెప్టెన్‌గా ఆరంగ్రేటం చేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి అవుట్ కాగా, భారత జట్టు 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది..
 

Image credit: PTI

2022లో సౌతాఫ్రికాతో సిరీస్ ద్వారా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రిషబ్ పంత్ కూడా కోహ్లీలాగే 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనూ టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోవడం విశేషం...

విరాట్ కోహ్లీ గైర్హజరీలో టీమిండియాకి కెప్టెన్లుగా వ్యవహరించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా మొదటి టీ20ల్లో విజయాలు అందుకున్నారు. విరాట్ కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్సీని పరాజయంతో ప్రారంభించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్.. 

Image credit: PTI

ఎమ్మెస్ ధోనీకి ముందు ఆ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నవారంతా కొన్ని మ్యాచులకే కెప్టెన్లుగా పరిమితం కాగా విరాట్ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు. మరి కోహ్లీలా పరాజయంతో కెప్టెన్సీని ప్రారంభించిన రిషబ్ పంత్, మాజీ సారథిలా సక్సెస్ అవుతాడా? అనేది చూడాలి... 

click me!