కుల్దీప్ యాదవ్ లేనప్పుడు అతన్ని ఆడించొచ్చుగా... ఆ స్పిన్నర్‌ లేకపోవడం వల్లే టీమిండియా...

Published : Jun 10, 2022, 05:17 PM ISTUpdated : Jun 10, 2022, 05:23 PM IST

విదేశాల్లో సంగతి ఎలా ఉన్నా, స్వదేశంలో టీ20, టెస్టు, వన్డే... ఫార్మాట్ ఏదైనా, సిరీస్ ఎవరితోనైనా టీమిండియా ప్రధాన అస్త్రం స్పిన్ బౌలర్లే. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత పేసర్లే కాదు, స్పిన్నర్లు కూడా ఫెయిల్ అయ్యారు...

PREV
18
కుల్దీప్ యాదవ్ లేనప్పుడు అతన్ని ఆడించొచ్చుగా... ఆ స్పిన్నర్‌ లేకపోవడం వల్లే టీమిండియా...
Image credit: PTI

టీ20ల్లో ఎప్పుడూ 200+ స్కోరు చేసిన తర్వాత ఓడిపోని టీమిండియా, మొట్టమొదటిసారిగా సౌతాఫ్రికా చేతుల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. బ్యాటర్లు 211 పరుగుల చేసిన తర్వాత కూడా టీమిండియా విజయం సాధించలేకపోయిందంటే ప్రధాన బాధ్యత వహించాల్సింది బౌలర్లే...

28
Image credit: PTI

సిరీస్ ఆరంభానికి ముందు కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా తప్పుకోవడంతో అక్షర్ పటేల్‌తో పాటు యజ్వేంద్ర చాహాల్‌లకు తుదిజట్టులో అవకాశం కల్పించింది టీమిండియా. అయితే ఈ ఇద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు...

38
Yuzvendra Chahal

ఐపీఎల్ 2022 సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన యజ్వేంద్ర చాహాల్ 2.1 ఓవర్లలో 26 పరుగులు ఇవ్వగా అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించాడు. బౌలర్లలందరిలోకి యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ ఒక్కటే 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి... 8.8 ఎకానమీతో కాస్త ఆకట్టుకున్నాడు...

48

తొలి ఓవర్‌లో 15 పరుగులిచ్చిన ఆవేశ్ ఖాన్, మిగిలిన 3 ఓవర్లలో కలిపి 20 పరుగులు మాత్రమే ఇచ్చి కమ్‌బ్యాక్ ఇవ్వగా యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్... సౌతాఫ్రికా బ్యాటర్లని పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు...

58

‘స్టార్ ప్లేయర్లు లేకపోయినా భారత జట్టు బలంగానే కనిపిస్తోంది. అయితే భారత జట్టులో యజ్వేంద్ర చాహాల్, రవి భిష్ణోయ్, అక్షర్ పటేల్‌లకు చోటు ఇచ్చారు. ఈ ముగ్గురూ కూడా లెగ్ స్పిన్నర్లే...

68
Image credit: Twitter

టీమ్ బ్యాలెన్స్‌గా ఉండాలంటే ముగ్గురు లెగ్ స్పిన్నర్లు అవసరమా? కుల్దీప్ యాదవ్ గాయపడినప్పుడైనా సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కి అవకాశం ఇవ్వాల్సింది. అతను టీ20 వరల్డ్ కప్ 2021 ఆడాడు, ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ బాగా బౌలింగ్ చేశాడు...

78

లెగ్ స్పిన్నర్లు వికెట్లు తీయలేనప్పుడు ఆ పనిని ఆఫ్ స్పిన్నర్లు చేయగలుగుతారు. కనీసం బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపిస్తూ పరుగులు రాకుండా అయినా నియంత్రించగలుగుతాడు... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

88

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 17 మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటుతోనూ 191 పరుగులు చేసి ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు... 

click me!

Recommended Stories