టీ20 ప్రపంచకప్ లో అతడు చాలా డేంజర్.. అడ్డుకోకుంటే కష్టమే.. టీమిండియా సారథిపై ఢిల్లీ హెడ్ కోచ్ కామెంట్స్

Published : Jun 10, 2022, 04:23 PM IST

Rishabh Pant: ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే ఈ టోర్నీలో ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న ఆటగాడు కీలకంగా మారుతాడని రికీ పాంటింగ్ అంటున్నాడు.

PREV
16
టీ20 ప్రపంచకప్ లో అతడు చాలా డేంజర్.. అడ్డుకోకుంటే కష్టమే..  టీమిండియా సారథిపై ఢిల్లీ హెడ్ కోచ్ కామెంట్స్

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో కలిసి పనిచేసిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఆ జట్టు కెప్టెన్,  ప్రస్తుతం టీమిండియాకు తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న రిషభ్ పంత్ పై ప్రశంసలు కురిపించాడు. రాబోయే ప్రపంచకప్ లో  అతడు చాలా ప్రమాదకర ఆటగాడని అన్నాడు. 

26

ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్.. పంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  పాంటింగ్ మాట్లాడుతూ.. ‘అతడు (రిషభ్) అద్భుతమైన ఆటగాడు. రాబోయే  టీ20 ప్రపంచకప్ లో భారత్ తరఫున అతడు అత్యంత ప్రమాదకర ఆటగాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

36

ఆసీస్ లో  ఉండే ఫ్లాట్, ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపై పంత్ చెలరేగుతాడు. ఈ టోర్నీలో  రిషభ్ పంత్ ఆటను తప్పుకుండా చూడాల్సిందే...’ అని చెప్పాడు. 

46

అంతేగాక.. ‘నేను పంత్ ను ఫ్లోటర్ (గాలిలో తేలియాడే) గా భావిస్తాను. బ్యాటింగ్ ఆర్డర్ లో అతడు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు.  ప్రస్తుతం పంత్ 5వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. కానీ చేతిలో వికెట్లు ఉండి ఓవర్లు ఉన్నప్పుడు పంత్ ను ముందుకు పంపినా ఆడగలడు..’ అని కొనియాడాడు. 

56

ఢిల్లీ క్యాపిటల్స్ తో నాలుగేండ్లుగా  ప్రయాణం చేస్తున్న  పాంటింగ్ తో పంత్ కు మంచి అనుబంధముంది.  గడిచిన రెండు సీజన్లుగా కెప్టెన్-హెడ్ కోచ్ గా వాళ్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు.  ఈ సీజన్ లో   అనుకున్నంత మేర రాణించకపోయినా ఢిల్లీ పోరాటం ఆకట్టుకున్నది. 

66

ఇక ఐపీఎల్-15 లో 14 మ్యాచులాడిన పంత్.. 340 పరుగులు చేశాడు. బ్యాటర్ గా అడపాదడపా రాణించినా   టోర్నీ ఆసాంతం అవే మెరుపులు మెరిపించలేకపోయాడు. 

Read more Photos on
click me!

Recommended Stories