IND vs PAK: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లో జరగనున్న ఈ మెగా టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఐపీఎల్ 2026 హడావిడి ముగియకముందే క్రికెట్ లవర్స్ కు మరో అదిరిపోయే ట్రీట్ రెడీ అయిపోయింది. పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సత్తా చాటిన తర్వాత, ఇప్పుడు మహిళల టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకాబోతోంది. ఈ సారి ఇంగ్లాండ్ లో జరగనున్న ఈ మెగా టోర్నీలో అందరి కళ్లు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. దాయాదుల పోరు అంటేనే గ్రౌండ్లో సెగలు పుట్టడం ఖాయం. ఆ ఉత్కంఠకు జూన్ 14న ముహూర్తం ఖరారైంది. మరోసారి భారత్, పాక్ లు క్రికెట్ మజాను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
25
మరోసారి దాయాదుల యుద్ధం
క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే చాలు.. స్టేడియంలు హౌస్‌ఫుల్ అవ్వాల్సిందే. క్రికెట్ లవర్స్ కు పూనకాలే. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో జూన్ 14న ఈ బిగ్ ఫైట్ జరగనుంది. రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోయినా, ఐసీసీ టోర్నీలలో తలపడటం అభిమానులకు పండుగే.
రికార్డుల పరంగా చూస్తే భారత మహిళల జట్టు పాకిస్థాన్ కంటే ఎంతో బలంగా ఉంది. అయితే, మైదానంలో ఆ రోజు ఒత్తిడిని జయించి, ఎవరు మెరుగ్గా ఆడితే విజయం వారినే వరిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. క్రికెట్ ప్రపంచం కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది.
35
గ్రూప్-1లో టీమిండియా.. ప్రత్యర్థులు వీరే
భారత జట్టు ఈసారి డిఫెండింగ్ వన్డే ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. టీమిండియాను గ్రూప్-1లో ఉంచారు. భారత్‌తో పాటు ఈ గ్రూప్‌లో బలమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ గ్రూప్ దశలో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
భారత్ తన వరల్డ్ కప్ వేటను పాకిస్థాన్‌తో జూన్ 14న ప్రారంభించనుంది.
• జూన్ 14: భారత్ vs పాకిస్థాన్ (ఎడ్జ్‌బాస్టన్)
• జూన్ 17: భారత్ vs నెదర్లాండ్స్ (హెడింగ్లీ)
• జూన్ 21: భారత్ vs సౌతాఫ్రికా (ఓల్డ్ ట్రాఫోర్డ్)
• జూన్ 25: భారత్ vs బంగ్లాదేశ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)
• జూన్ 28: భారత్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్)
గ్రూప్ దశలో ఆస్ట్రేలియాతో జరిగే చివరి మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది.
55
హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత జట్టు
ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి జట్టును ముందుండి నడిపించనుంది. ఆమె కెప్టెన్సీలోనే గత ఏడాది భారత్ స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.
ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు నందిని శర్మ, భారతి ఫుల్మాలి వంటి యంగ్ ప్లేయర్లకు కూడా చోటు దక్కింది. యువ రక్తం, అనుభవం కలిసిన టీమిండియా ఈసారి టీ20 ట్రోఫీని కూడా ముద్దాడాలని పట్టుదలతో ఉంది.