Champions Trophy: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ విన్నర్ అతడే !

Published : Feb 22, 2025, 12:43 PM ISTUpdated : Feb 22, 2025, 12:45 PM IST

IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో హై వోల్టేజీ మ్యాచ్ ఆదివారం జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడాలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, ఈ మ్యాచ్ లో అతిపెద్ద మ్యాచ్ విన్నర్ ఎవరు అవుతారో అనే విషయంపై మాజీ క్రికెటర్ల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
14
Champions Trophy: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ విన్నర్ అతడే !
Champions Trophy IND vs PAK

Champions Trophy IND vs PAK : క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగే ఈ మ్యాచ్ లో గెలవాలని ఇరు జట్లు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగబోయే మ్యాచ్ ముందు.. మాజీ క్రికెటర్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్ అని యువరాజ్ సింగ్ అన్నాడు. రోహిత్ కష్టాల్లో ఉన్నా పరుగులు చేస్తే అది ప్రత్యర్థులకు ప్రమాదకరంగా మారుతుందని చెప్పాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ శర్మ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ గా ఉంటాడని యూపీ అన్నారు.

24

50 ఓవర్లు, టీ20 వరల్డ్ కప్ లతో పోలిస్తే, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దే పైచేయిగా ఉంది. అయితే, చివరి 10 మ్యాచ్ లను గమనిస్తే పాక్ పై భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అందుకే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలోకి మంచి ఊపుతో వచ్చింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది.

జియోహాట్‌స్టార్‌లో 'గ్రేటెస్ట్ రైవలరీ రిటర్న్స్'లో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, రోహిత్ ఫామ్ లో ఉన్నా లేకున్నా తనకు తేడా ఏం లేదన్నాడు. అతను ఏ సమయంలోనై ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడే సత్తా ఉన్న ప్లేయర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. 

"వన్డే క్రికెట్‌లో, ముఖ్యంగా వైట్-బాల్ ఫార్మాట్‌లలో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ కూడా ఇండియాకు పెద్ద మ్యాచ్ విన్నర్. రోహిత్ కష్టపడుతూ పరుగులు చేసినా, అది ప్రత్యర్థికి ప్రమాదమే. అతను ఫామ్ లో ఉంటే, 60 బంతుల్లోపే సెంచరీ కొడతాడు. అదే అతని ప్రత్యేకత. ఒక్కసారి అతను ఫామ్ లోకి వస్తే, ఫోర్లు మాత్రమే కాదు సిక్సర్ల వర్షం కురుస్తుంది. షార్ట్ బాల్ ఆడే ప్లేయర్లలో అతను బెస్ట్. ఎవరైనా 145-150 కిలోమీటర్ల వేగంతో బంతి వేసినా, రోహిత్ దాన్ని హుక్ చేయగలడు. అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 120-140 మధ్యలో ఉంటుంది. అతను ఆ రోజు ఫామ్ లో ఉంటే, సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ గెలిపించగలడని" యువరాజ్ సింగ్ అన్నారు.

 

34
Team India

పాక్ పై రోహిత్ కు సూపర్ రికార్డులు 

పాకిస్తాన్ తో ఆడిన 19 వన్డేల్లో రోహిత్ 51.35 సగటుతో 873 పరుగులు చేశాడు. అతని సగటు 92.38. ఇందులో రెండు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 140 పరుగులు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ మరోసారి పాక్ మ్యాచ్ లో పరుగుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. 

2024-25 టెస్ట్ సీజన్‌లో బంగ్లాదేశ్ టెస్టుల నుంచి ఆస్ట్రేలియా టూర్ వరకు రోహిత్ ఫామ్ పెద్దగా లేదు. ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. 15 ఇన్నింగ్స్‌లలో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. కానీ వన్డేల్లో మాత్రం బాగానే ఆడుతున్నాడు. నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లలో 40.75 సగటుతో 163 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 120.74. ఇందులో ఇంగ్లాండ్‌పై ఒక సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 41 పరుగులు చేశాడు.

44

ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.

ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టు:

మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రాఫ్, ఖుష్‌దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.

Read more Photos on
click me!

Recommended Stories