రోహిత్ శర్మను ఎలా అవుట్ చేయాలో నేనే చెప్పా... షాహీన్ ఆఫ్రిదీకి బౌలింగ్ ఎలా వేయాలో నేర్పించా...

First Published Dec 3, 2021, 4:26 PM IST

మనమే డబ్బా రాయుళ్లం అనుకుంటే, మనకంటే డబ్బా రాయుళ్లు మన పొరుగుదేశం పాకిస్తానీలు. లేక లేక ఐసీసీ వరల్డ్ కప్‌‌ టోర్నీల్లో భారత జట్టుపై దక్కిన తొలి విజయాన్నే, వరల్డ్ కప్ టైటిల్ గెలిచినట్టుగా సంబరంగా చెప్పుకుంటున్నారు పాక్ క్రికెటర్లు. తాజాగా పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా, భారత్ వర్సెస్ పాక్‌ మ్యాచ్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ... భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు...

ఇన్నింగ్స్‌ రెండో బంతికే ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మను డకౌట్ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాతి ఓవర్‌లో కెఎల్ రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు...

హాఫ్ సెంచరీ చేసి, టీమిండియా ఓ మాదిరి స్కోరు చేయడానికి కారణమైన భారత సారథి విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ వేసిన సెకండ్ స్పెల్‌లో వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

‘టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి వెళ్లేముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, చీఫ్ సెలక్టర్‌తో కలిసి ఇక్కడికి వచ్చాడు. ఇండియాతో జరిగే మ్యాచ్‌కి ఎలాంటి ప్లాన్స్‌తో ప్రిపేర్ అయ్యారని అడిగాను...

అతను కొన్ని ప్లాన్స్ చెప్పాడు. అయితే బాబర్ ఆజమ్ చెప్పిన ప్లాన్స్, టీమిండియా బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టవని గ్రహించాను. వెంటనే నా దగ్గర్నున్న ప్లాన్స్‌ని బాబర్‌కి చెప్పా...

టీమిండియా డేంజరస్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మను ఎలా అవుట్ చేయాలా, బాబర్‌కి స్పష్టంగా వివరించా. షాహీన్ ఆఫ్రిదీ చాలా వేగంగా బంతులు వేయగలడు...

కానీ కేవలం 100 కి.మీ.ల వేగంతో ఇన్‌స్వింగర్ బంతులు వేస్తే... రోహిత్ శర్మ వికెట్ త్వరగా దక్కుతుందని చెప్పా. షాహీన్ కూడా నేను చెప్పినట్టే చేశాడు...

అలాగే కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అవుట్ చేయాలో కూడా బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదీలకు వివరించా... నేను చెప్పినట్టే చేసి టీమిండియాను ఓడించారు’ అంటూ  చెప్పుకొచ్చాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

రమీజ్ రాజా కామెంట్లతో సొంత దేశస్థులే తీవ్రంగా ట్రోల్ చేస్తుండడం విశేషం. అదేదో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను దగ్గరుండి గెలిపించి ఉంటే, పాక్‌కి టైటిల్ దక్కేది కదా... అంటూ మీమ్స్ పోస్టు చేస్తున్నారు...

click me!