ఇదేం చెత్త అంపైరింగ్, బ్యాటుకి తగులుతున్నట్టు కనిపించినా... విరాట్ కోహ్లీ అవుట్‌పై వివాదం...

First Published Dec 3, 2021, 2:59 PM IST

టీమిండియాకి అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ, అంపైర్ ఇచ్చిన ఓ వివాదాస్పద నిర్ణయం కారణంగా డకౌట్ అయి, పెవిలియన్ చేరాడు...

మొదటి వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. 71 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఆ తర్వాత 5 బంతులు ఆడిన అజాజ్ పటేల్, పరుగులేమీ చేయకుండానే అజాజ్ పటేల్ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఛతేశ్వర్ పూజారాకి టెస్టుల్లో ఇది 10వ డకౌట్ కాగా, న్యూజిలాండ్‌పై మొదటిది...

టెస్టుల్లో మూడో స్థానంలో ఛతేశ్వర్ పూజారా డకౌట్ కావడం ఇది 8వ సారి. అత్యధికసార్లు డకౌట్ అయిన వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డు సమం చేశాడు పూజారా..

ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించిన వెంటనే, విరాట్ కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు...

టీవీ రిప్లైలో విరాట్ కోహ్లీ బ్యాటుకి ముందుగా బాల్ తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా, థర్డ్ అంపైర్ మాత్రం ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది...

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా విరాట్ కోహ్లీ అవుట్ నిర్ణయంపై స్పందించాడు. ‘నా ఉద్దేశంతో విరాట్ బ్యాటుకి మొదట బంతి తగిలింది. అయితే స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో విరాట్‌ని అంపైర్ ఇచ్చి ఉండొచ్చు...

అయితే బ్యాటుకి మొదట బంతి తాకిందని చెప్పడానికి కామన్ సెన్స్ ఉండే సరిపోతుంది. అయితే కామన్ సెన్స్ అందరికీ కామన్ కాదు కదా... విరాట్ కోహ్లీ బాధను అర్థం చేసుకోగలను...’ అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్...

ఈ ఏడాది విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఇది 5వ సారి. ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా 1983 కపిల్‌దేవ్ రికార్డును సమం చేశాడు విరాట్...

విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇది 14వ డకౌట్ కాగా, న్యూజిలాండ్‌పై మొదటిది. స్వదేశంలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత సారథిగా (6 సార్లు) రికార్డు క్రియేట్ చేశాడు విరాట్...

టెస్టు సెంచరీ లేకుండా స్వదేశంలో 20 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్న ఛతేశ్వర్ పూజారా, ఓవరాల్‌గా 41 ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయలేకపోయాడు..

ఈ ఏడాది టెస్టుల్లో నాలుగుసార్లు డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, బిషన్ సింగ్ భేడీ (1976), కపిల్‌దేవ్ (1983), ఎమ్మెస్ ధోనీ (2011) రికార్డులను సమం చేశాడు...

80/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, అదే స్కోరు వద్ద మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ మూడు వికెట్లు కూడా అజాజ్ పటేల్‌కి దక్కడం మరో విశేషం...

click me!