ఐపీఎల్ సమయంలో ఆ అంపైర్‌తో గొడవపడ్డ విరాట్ కోహ్లీ... ఆ పగతోనే అవుట్ ఇచ్చాడా...

First Published Dec 3, 2021, 3:50 PM IST

ముంబైలోని వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఓ డబుల్ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. గత రెండేళ్లుగా సెంచరీ మార్క్ అందుకోలేకపోతున్న విరాట్, ఇక్కడ ఆ ఫీట్్ అందుకుంటాడని ఆశించారు క్రికెట్ ఫ్యాన్స్...

2016లొ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై 340 బంతుల్లో 235 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌ అయ్యాక ఐదేళ్ల తర్వాత తిరిగి వాంఖడే స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఆడుతోంది టీమిండియా...

వాంఖడేలో విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డు చూసి, ఈ సారి టీమిండియా కెప్టెన్ 71వ సెంచరీ సాధించకుండా ఎవ్వరూ ఆపలేరని ఫిక్స్ అయిపోయాడు...

అయితే థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ రూపంలో విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది...

విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా అంపైర్ ప్రకటించగా, థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ... బ్యాడ్ ఎడ్జ్ తగులుతున్నట్టుగా టీవీ రిప్లైలో కనిపించినా అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది...

థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫీల్డ్ అంపైర్‌ని అడిగిన విరాట్ కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఈ డెసిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది.

ఒకవేళ బ్యాటుకి తగులుతుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకపోతే ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద బ్యాట్స్‌మెన్‌కి అనుకూలంగా ఫలితం రావాలి. అయితే థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో దాన్ని సపోర్ట్ చేస్తూ ‘కంక్లూజివ్ ఎవిడెన్స్’ లేదంటూ అవుట్‌గా ప్రకటించాడు...

విరాట్ కోహ్లీని అవుట్‌గా ప్రకటించడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా అంపైర్లపై కేకలు, అరుపులతో నిరసనలు తెలిపారు. టీ బ్రేక్ విరామం తర్వాత స్టేడియంలోకి వస్తున్న అంపైర్లపైకి పేపర్లు విసిరారు...

అయితే థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ, విరాట్ కోహ్లీని అవుట్‌గా ప్రకటించడానికి వేరే కారణాలున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను వైరల్ చేస్తున్నారు...

మార్చి నెలలో ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్‌ను సరిగా అందుకోలేకపోయాడు ఇంగ్లాండ్ ఫీల్డర్. టీవీ రిప్లైలో స్పష్టంగా బంతి నేలను తాకుతున్నట్టు కనిపించినా, అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు...

అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచుల సమయంలోనూ విరాట్ కోహ్లీ, ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న వీరేందర్ శర్మ ఇచ్చిన నిర్ణయాలపై గొడవ పెట్టుకోవడం చాలాసార్లు జరిగింది...

ఇవన్నీ మనసులో పెట్టుకున్న వీరేందర్ శర్మ, కావాలనే ముంబై టెస్టులో విరాట్ కోహ్లీని అవుట్‌గా ప్రకటించాడని ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు...

click me!