IND VS NZ WTC Final: తొలి ఐసీసీ ట్రోఫీని విరాట్ కోహ్లీ దక్కించుకోవాలంటే ఈ స్ట్రాటజీ కీలకం...

Published : Jun 18, 2021, 11:33 AM IST

చారిత్రక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌ లైనప్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలు భారత్‌కు కీలకం కానున్నారు.

PREV
17
IND VS NZ WTC Final: తొలి ఐసీసీ ట్రోఫీని విరాట్ కోహ్లీ దక్కించుకోవాలంటే ఈ స్ట్రాటజీ కీలకం...

మొన్నటి ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలో నిలిచినా.. భారత్‌ విజేతగా నిలువలేదు. ఇప్పుడు ఇంగ్లీష్‌ పరిస్థితుల్లో అండర్‌డాగ్‌గా పోటీపడుతున్న టీమ్‌ ఇండియా చారిత్రక ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గదపై కన్నేసింది. కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీని ఎరుగని విరాట్‌ కోహ్లి.. సౌథాంప్టన్‌లో తన ఆకలి తీర్చుకోవాలని వేటకు సిద్ధమయ్యాడు.

27

ఐదు రోజుల ఆటలో అగ్రజట్లు అత్యుత్తమ టైటిల్‌ వేటకు బయల్దేరాయి. వరల్డ్‌ నం.1 న్యూజిలాండ్‌, వరల్డ్‌ నం.2 భారత్‌లు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. సౌథాంప్టన్‌ వేదికగా డబ్ల్యూటీసీ అంతిమ సమరం నేటి నుంచి ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌ విజయంతో న్యూజిలాండ్‌ నేటి చారిత్రక ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ టోర్నీల్లో అగ్ర స్థానంలో నిలిచిన భారత్‌.. ఆస్ట్రేలియాలో సాధించిన విజయ స్ఫూర్తిని సౌథాంప్టన్‌లో పునరావృతం చేసి కప్పును ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతోంది. 

37

టీం కలిసికట్టుగా ఆడితేనే...         

చారిత్రక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్‌ లైనప్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెలు భారత్‌కు కీలకం కానున్నారు. ఈ ముగ్గురు ప్రదర్శన భారత్‌ అవకాశాలను ప్రభావితం చేయనుంది. ధనాధన్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌లు ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించగల సమర్థులు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు మెగా ఇన్నింగ్స్‌తో సందడి చేసినా.. సౌథాంప్టన్‌లో భారత్‌ పండుగ చేసుకోవటం లాంఛనమే. 

ఇంగ్లీష్‌ పరిస్థితుల్లో మహ్మద్‌ షమి బౌలింగ్‌ విభాగంలో కీలకం కానున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా వికెట్లు పడగొట్టే షమికి బుమ్రా, ఇషాంత్‌లు తోడైతే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ విలువైన పాత్ర పోషించే మ్యాచ్‌లో.. భారత్‌కు అశ్విన్‌, జడేజా రూపంలో ఇద్దరు నాణ్యమైన ఆల్‌రౌండర్లు రెడీగా ఉన్నారు.

47

ఇద్దరు స్పిన్నర్లతో భారత్... 

 ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జడేజా తుది జట్టులో నిలిచారు. సౌథాంప్టన్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్‌మెంట్‌ ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుంది. ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జశ్‌ప్రీత్‌ బుమ్రాలు పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. తెలుగు తేజాలు హనుమ విహారి, మహ్మద్‌ సిరాజ్‌లు తుది జట్టులో నిలువలేకపోయారు. రవీంద్ర జడేజాకు హనుమ విహారి స్థానం కోల్పోగా.. ముగ్గురు సీమర్ల ఫార్ములాతో సిరాజ్‌ బెంచ్‌కు పరిమితమయ్యాడు. ఉమేశ్‌ యాదవ్‌, వృద్దిమాన్‌ సాహాలు సైతం బెంచ్‌పైనే ఉన్నారు.

57

ఆటతీరు: న్యూజిలాండ్ వర్సెస్ భారత్... 

దూకుడుగా మ్యాచ్‌ను కైవసం చేసుకునే శైలి భారత్‌ది కాగా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ మ్యాచ్‌పై పట్టు బిగించే శైలి న్యూజిలాండ్‌ది. ప్రత్యర్థిపై పంజా విసరటం కివీస్‌ నైజం కాదు. కానీ సెషన్ల వారీగా స్వల్ప పట్టుతో తిరుగులేని స్థానంలో నిలువగలదు. డబ్ల్యూటీసీ టోర్నీల్లో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండ్‌. 

యువ ఓపెనర్‌ కాన్వే, లేథమ్‌లు మెరుపు ఫామ్‌లో ఉన్నారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌లు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ విభాగానికి కీలకం. ట్రెంట్‌ బౌల్ట్‌, నీల్‌ వాగర్‌, మాట్‌ హెన్రీలను ఎదుర్కొవటం అంత సులువు కాదు. అనుకూల పరిస్థితుల్లో అద్భుత విజయం సాధించాలనే తహతహ కివీస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. విదేశీ పరిస్థితులను సవాల్‌గా తీసుకుని రెచ్చిపోతున్న కోహ్లిసేనకు న్యూజిలాండ్‌ ఎటువంటి వ్యూహలు తయారు చేసిందో చూడాలి.

67

పిచ్‌, వెదర్ కండిషన్స్... 

ఇంగ్లాండ్‌లో స్పిన్‌కు సహకరించే వేదికల్లో సౌథాంప్టన్‌ ఒకటి. ప్రస్తుతం ఇక్కడ పగటి వేళ మంచి ఎండ కాస్తోంది. ఇద్దరు స్పిన్నర్లతో ఆడుతున్న భారత్‌కు అనుకూలం. పిచ్‌పై చెప్పుకోదగిన పచ్చిక కనిపిస్తోంది. పేస్‌, బౌన్స్‌కు ఏమాత్రం కొదవ లేకపోవచ్చు. ఐదు రోజుల ఆటకు వాతావరణం సైతం ఆహ్లాదకరంగా ఉండనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గుచూపనుంది.

77

ప్లేయింగ్ ఎలెవన్... 

భారత్‌ : రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అజింక్య రహానె, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జశ్‌ప్రీత్‌ బుమ్రా. 

న్యూజిలాండ్‌ (అంచనా): టామ్‌ లేథమ్‌ (వికెట్‌ కీపర్‌), డెవన్‌ కాన్వే, విల్‌ యంగ్‌, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, అజాజ్‌ పటేల్‌/ హెన్రీ నికోల్స్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హౌమ్‌, కైల్‌ జెమీసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, నీల్‌ వాగర్‌, మాట్‌ హెన్రీ.

click me!

Recommended Stories