ఆ ఓటమి తర్వాత రాహుల్ ద్రావిడ్ వచ్చారు, అదే మా టర్నింగ్ పాయింట్... ఛతేశ్వర్ పూజారా కామెంట్స్...

First Published Nov 23, 2021, 7:33 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ, అంతకుముందు ఐసీసీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచులు పక్కనబెడితే... టెస్టు సిరీస్‌ల్లో టీమిండియా పర్ఫామెన్స్ బాగానే ఉంది. అప్పుడప్పుడూ తప్ప, ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది భారత జట్టు...

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ 2021 తర్వాత ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో భారత జట్టు టెస్టు పర్ఫామెన్స్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి...

అయితే టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు తీసుకోకముంటే ఓటమి భారంతో కృంగిపోయిన భారత జట్టుపై, ఆటగాళ్లపై ప్రభావం చూపించాడట రాహుల్ ద్రావిడ్...

‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత మేమంతా బాగా నిరాశకు లోనయ్యాం. అప్పటిదాకా పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్‌గా ఉన్న మేం, టైటిల్ సాధించలేకపోయినందుకు బాగా ఫీల్ అయ్యాం...

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నందుకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కి, టెస్టు సిరీస్‌కి మధ్య ఉన్న ఆ 20 రోజులు చాలా కష్టంగా గడిచాయి. అయితే ఆ పరాజయం తర్వాత శ్రీలంక టూర్‌లో భారత జట్టుకి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు...

రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వస్తారనే విషయం కూడా అప్పుడే మాకు తెలిసింది. ఆ వార్త టీమిండియాలో కొత్త ఉత్సాహం నింపింది...

ముఖ్యంగా ఇండియా- A, అండర్-19 టీమ్‌లో ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో ఆడిన ప్లేయర్లలో ఈ వార్త కొత్త ఉత్సాహం నింపింది. రాహుల్ ద్రావిడ్, ఇంగ్లాండ్‌కి వచ్చి భారత జట్టును కలిశారు...

ఆయనతో విలువైన సంభాషణ సీనియర్లలోనూ తెలియని నూతనోత్సాహాన్ని నింపింది. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణాన్ని ద్రావిడ్ మెయింటైన్ చేస్తున్న విధానం అద్భుతం...

జట్టులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరికీ స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చారు రాహుల్ ద్రావిడ్...’ అంటూ కామెంట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా...

రాహుల్ ద్రావిడ్ ‘ది వాల్’గా గుర్తింపు తెచ్చుకుంటే, ఆయన వారసుడిగా, ‘నయా వాల్’గా పేరు తెచ్చుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. అయితే గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు పూజారా...

పూర్తి స్థాయి టీమిండియా హెడ్ కోచ్‌గా ఆడిన తొలి టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన రాహుల్ ద్రావిడ్, టెస్టుల్లో ఎలాంటి పర్ఫామెన్స్ రాబడతాడోనని ఆశగా ఎదురుచూస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్..

click me!