రోహిత్ శర్మ టార్గెట్ అదే, దానికోసమే ఇప్పటి నుంచి... జహీర్ ఖాన్ కామెంట్స్...

First Published Nov 20, 2021, 11:23 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది టీమిండియా. భారీ అంచనాలతో టోర్నీని ప్రారంభించిన భారత జట్టు, వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్‌కి దూరమైంది. గ్రూప్ స్టేజీకి పరిమితమై, ఘోర పరాభవంతో టోర్నీని ముగించింది...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్ ముగిసిన రెండు రోజులకే టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచులను గెలిచి, సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు...

మొదటి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...

కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కలిసి మొదటి వికెట్‌కి 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరి మధ్య ఇది టీ20ల్లో ఐదో శతాధిక భాగస్వామ్యం కావడం విశేషం...

‘వెంకటేశ్ అయ్యర్‌ని వన్‌డౌన్ ప్రమోట్ చేయడం చాలా మంచి ఎత్తుగడ. చూస్తుంటే రోహిత్ శర్మ, ఇప్పటి నుంచే వచ్చే టీ20 వరల్డ్‌కప్ టోర్నీని టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తోంది...

వెంకటేశ్ అయ్యర్‌ లాంటి ఆల్‌రౌండర్‌ దొరికినప్పుడు అతన్ని సరిగా వాడుకోవడం తెలియాలి. లేదంటే ఓ మంచి ప్లేయర్‌ని జట్టు కోల్పోతుంది...

వచ్చే టీ20 వరల్డ్‌కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని, జట్టు ఎంపిక చేయడమే కాకుండా ప్రయోగాలు కూడా చేయడం చాలా మంచి విషయం...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్...

మొట్టమొదటి మ్యాచ్‌లో మొదటి బంతికి బౌండరీ బాది, ఆ తర్వాతి బంతికి విభిన్నమైన షాట్‌కి ప్రయత్నించి అవుటయ్యాడు వెంకటేశ్ అయ్యర్. రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి 11 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

‘టీమిండియా టాపార్డర్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? మొదటి రెండు మ్యాచుల్లోనూ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి, అభిమానులను టెన్షన్ పెట్టారు...

ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును తెగ ఇబ్బంది పెడుతున్న విషయం కూడా ఇదే. మిడిల్ ఆర్డర్‌లో మంచి ప్లేయర్లు ఉన్నారు. కానీ కీలక సమయాల్లో వాళ్లు ఫెయిల్ అవుతున్నారు.

టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవాలనుకుంటే, మిడిల్ ఆర్డర్‌పై ఫోకస్ పెట్టాలి. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ త్వరగా అవుటైన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచుల్లో ఫలితం ఎలా వచ్చిందో చూశాం...

టాపార్డర్ ఫెయిల్ అయినా భారీ స్కోరు అందించగల మిడిల్ ఆర్డర్‌ను తయారుచేయగలిగితే భారత జట్టుకి ఎదురే ఉండదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా...

click me!