నేను బోను నుంచి బయటపడిన పులిని, వాళ్లని తినేస్తా... బంగ్లా క్రికెటర్ ముస్తాఫికర్ రహీం...

First Published Nov 19, 2021, 10:03 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ క్వాలిఫైయర్ రౌండ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో ఓడిన బంగ్లాదేశ్, సూపర్ 12 రౌండ్ స్టేజ్‌‌లో ఐదుకి ఐదు మ్యాచుల్లోనూ ఓడి, చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఈ టోర్నీలో ఫెయిల్ అయిన ముస్తాఫికర్ రహీంని, పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కి ఎంపిక చేయలేదు సెలక్టర్లు...

టీమిండియా ఓడిన సమయంలో సంతోషంగా ఉందంటూ ఫోటో పోస్టు చేసిన ముస్తాఫికర్ రహీం, ఆసియా కప్ ఫైనల్‌లో మ్యాచ్ గెలవడానికి ముందే నాగిని డ్యాన్స్ చేసి విమర్శల పాలయ్యాడు...

ప్రతీసారీ ఐపీఎల్‌ వేలానికి తన పేరును రిజిస్టర్ చేసుకోవడం, రహీంని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోకపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది...

‘ప్రతీ క్రికెటర్ కెరీర్‌లో ఎత్తు పల్లాలు ఉంటాయి. నేను జట్టుకి ఎంపిక కాకపోవడం ఇది తొలిసారేం కాదు. కానీ ఓ టీ20 సిరీస్‌లో నాకు చోటు దక్కకపోవడం చాలా రోజుల తర్వాత జరిగింది...

నన్ను పక్కనబెట్టినందుకు నేనేం ఫీల్ అవ్వడం లేదు. గోడకు కొట్టిన బంతిలా నేను బలంగా తిరిగి జట్టులోకి వస్తాను. బంగ్లాదేశ్‌కి విజయాలు అందించడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే...

ఇక్కడితో ప్రపంచం అంతమైపోలేదు, అవకాశం దొరికినప్పుడల్లా నా బెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. నా పర్ఫామెన్స్, ఫిట్‌నెస్ సరిగానే ఉన్నాయి. నాకు విశ్రాంతినిచ్చారని భావిస్తా...

సెలక్షన్ ప్యానెల్, మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్, టీమ్ డైరెక్టర్ ఎవ్వరూ కూడా పాకిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కి నన్ను ఎంపిక చేయకూడదని అనుకున్నారని చెప్పారు...

నేను బోను నుంచి బయటపడిన పులి లాంటి వాడిని. నేను నా పర్ఫామెన్స్‌తో వాళ్లందరినీ తినేస్తా. ఆస్ట్రేలియా సిరీస్‌కి ముందు ఛీఫ్ సెలక్టర్ నాకు ఫోన్ చేసి, మా అమ్మానాన్నల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు...

కొన్ని రోజుల తర్వాత నేను ఆస్ట్రేలియాకి సిద్ధంగా ఉన్నానని ఫోన్ చేసి చెప్పాను. కానీ వాళ్లేం చెప్పలేదు. నేను లేకుండానే ఆస్ట్రేలియాపై బంగ్లా విజయాన్ని అందుకుంది...

దాంతో జట్టులో నేను లేకపోయినా బంగ్లాదేశ్ జట్టు గెలుస్తుందని సెలక్టర్లు భావించి ఉండొచ్చు. అయితే బంగ్లాదేశ్ హెడ్ కోచ్ రస్సెల్ డొమింగోతో నాకు మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది...

నన్ను నేను ఓ క్రికెటర్‌గా చూడను. ఓ మెంటర్‌గా అనుకుంటాను. నేను ఎక్కడ ముగించానో, నా తర్వాత వచ్చిన వాళ్లు అక్కడి నుంచి మొదలెట్టాలని అనుకుంటున్నా...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత వికెట్ కీపింగ్ చేయకూడదని అనుకున్నా. నురుల్ హసన్ నా కంటే బాగా వికెట్ కీపింగ్ చేస్తాడని అనుకున్నా... కానీ మేనేజ్‌మెంట్ నా మాటలను వేరేగా అర్థం చేసుకుని ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ముస్తాఫికర్ రహీం...

click me!