ప్లేయర్లను పక్కనబెట్టడం చాలా తేలిక, కానీ ఆ ఇద్దరూ... టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

First Published Nov 22, 2021, 7:41 PM IST

ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శన ఎలా ఉన్నా, ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం ఫార్మాట్‌తో లేకుండా అదరగొట్టింది భారత జట్టు. భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ కలిసి భారత జట్టుకు అనేక ద్వైపాక్షిక సిరీస్‌లను అందించారు...

ముఖ్యంగా రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు టెస్టుల్లో అద్వితీయ విజయాలు అందుకుంది. వరుసగా ఐదేళ్లు ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది భారత జట్టు...

అయితే గత కొన్నాళ్లుగా టెస్టుల్లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా పర్ఫామెన్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అజింకా రహానే గత ఏడాది కాలంలో 19 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 372 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సగటు 20 కంటే తక్కువే...

అలాగే ‘నయా వాల్’గా పేరొందిన ఛతేశ్వర్ పూజారా రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. గత 20 ఇన్నింగ్స్‌ల్లో 31.11 సగటుతో 591 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

రెండేళ్ల క్రితం వరకూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరూ, ఇప్పుడు సరైన ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇద్దరినీ టీమ్ నుంచి తప్పించాలని ట్రోల్స్ కూడా వస్తున్నాయి...

‘ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయితే, ఆ ప్లేయర్లను తీసి పక్కనబెట్టడం చాలా తేలిక. అయితే వారి అనుభవాన్ని ఎంత ఇచ్చినా మార్కెట్లో‌ దొరకదు... అనుభవం అనేది సంపాదించాల్సిందే...

అందుకే వారి అనుభవాన్ని, టీమిండియాకి వాళ్లు చేసిన సేవలను గుర్తుంచుకున్నాం. వారికంటే ఎక్కువ అనుభవం ఉన్న ప్లేయర్ దొరికితే, వారికి అవకాశం ఇవ్వొచ్చు. భారత టెస్టు జట్టుకి రహానే, పూజారా చేసిన సేవలు మాకు తెలుసు, అందుకే వారికి వరుస అవకాశాలు ఇచ్చాం...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

‘కొన్నిసార్లు ఓ చిన్న తప్పు, అంతకుముందు చేసిన ఒప్పులన్నింటినీ కప్పేస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్రదర్శన అలాంటిదే. ఏడేళ్లుగా భారత జట్టుతో కలిసి ట్రావెల్ చేస్తున్నా...

ఇప్పటికే నా వయసు 50 దాటింది. ఈ ఏజ్‌లో నిరంతరం ప్రయాణాలు చేస్తుండడం, కుటుంబానికి, ఇంటికి దూరంగా బతకడం కష్టమని అనిపించింది... అందుకే బ్రేక్ తీసుకున్నా...

హెడ్ కోచ్‌గా నేను అనుకున్నదానికంటే ఎక్కువే సాధించా. అందుకే సరైన సమయంలో ఆ ప్లేస్ నుంచి తప్పుకోవడం భావ్యమని అనిపించింది. ఇంగ్లాండ్ టూర్‌లో ఈ నిర్ణయం తీసుకున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!