బిగ్‌బాష్ షోలోకి క్రికెటర్ సురేష్ రైనా... ఆ ఒక్క కండీషన్‌తో ‘రియాలిటీ షో’లోకి వెళ్తానంటూ...

First Published Nov 22, 2021, 7:15 PM IST

టీమిండియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్ కంటే, రెట్టింపు క్రేజ్, ఫాలోయింగ్ ఐపీఎల్ ద్వారా సంపాదించుకున్నాడు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా. ఎమ్మెస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే, గతంలో మూడు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రైనా, ‘మిస్టర్ ఐపీఎల్’గా లీగ్‌లో నిలకడైన పర్ఫామెన్స్ ఇచ్చాడు...

టీమిండియా తరుపున 18 టెస్టులు ఆడి, ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీలతో 768 పరుగులు చేసిన సురేష్ రైనా, బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. అయితే సీనియర్ల కారణంగా సురేష్ రైనాకి టెస్టుల్లో ఎక్కువ అవకాశాలు రాలేదు...

రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన సురేష్ రైనా, టీమిండియా తరుపున 226 వన్డేల్లో ఐదు సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో 5615 పరుగులు చేశాడు. 78 టీ20 మ్యాచుల్లో ఓ సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 1605 పరుగులు చేశాడు...

మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన అతికొద్ది మంది భారత క్రికెటర్లలో ఒకడైన సురేష్ రైనా, ‘చిన్నతలా’గా ఐపీఎల్ ద్వారా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు...

‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు, రోహిత్ శర్మ మొదటి మూడు మ్యాచుల్లో గెలిచినప్పుడు సురేష్ రైనా పేరు ట్రెండింగ్‌లో కనిపించింది...

సురేష్ రైనా కెప్టెన్సీలో 12 మ్యాచులు (టీ20, వన్డేలు) ఆడిన భారత జట్టు, అన్నింట్లోనూ విజయాలు అందుకుంది. 100 శాతం విజయాల రేటు ఉన్న అతికొద్దిమంది కెప్టెన్లలో రైనా ఒకడు...

‘నాకు బిగ్‌బాష్ రియాలిటీ షోకి వెళ్లాలని ఉంది. అయితే నార్త్‌లో హిందీ బిగ్‌బాస్‌కి వెళ్లడం ఇష్టం లేదు. ఇక్కడ సౌత్ ఇండియన్‌ది కావాలి. నేను ఇక్కడి బిగ్‌బాస్‌లు చూశాను. కాకపోతే వాళ్ల భాషలు నేర్చుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా..

ఆస్ట్రేలియా వివాదాస్పద ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌తో పాటు భారత పేసర్ శ్రీశాంత్, సలిల్ అంకోలా, వినోద్ కాంబ్లీ, నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, రెజ్లర్ ది గ్రేట్ కాళీ వంటి క్రీడాకారులు... ‘బిగ్‌బాష్‌’ టీవీ షోలో పాల్గొన్నారు...

ఐపీఎల్‌లో 11 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడిన సురేష్ రైనా, ఆ జట్టుపై నిషేధం పడిన రెండేళ్లు గుజరాత్ లయన్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రైనా కెప్టెన్సీలో 2016 సీజన్‌లో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచింది గుజరాత్ లయన్స్...

ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన సురేష్ రైనా, సరైన ఫామ్‌లో లేని కారణంగా టీమ్‌లో ప్లేస్ కోల్పోయాడు. రైనా స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రాబిన్ ఊతప్ప, రాణించడంతో రైనాకి ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లో కూడా చోటు దక్కలేదు...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం ఉండడంతో సీఎస్‌కే, సురేష్ రైనాని రిటైన్ చేసుకుంటుందా? అనేది అనుమానంగా మారింది. ఎమ్మెస్ ధోనీకి ఫస్ట్ రిటైన్ కార్డు వాడతామని చెప్పిన సీఎస్‌కే యాజమాన్యం, రైనా విషయంలో మాత్రం ఆ ధైర్యం చేయకపోవచ్చు...

ఇంతకుముందు ఐపీఎల్ ఆడితే సీఎస్‌కే తరుపునే ఆడతానని, వేరే టీమ్‌కి ఆడనని కామెంట్ చేసిన సురేష్ రైనా, ఆ తర్వాత మాట మార్చాడు. చెన్నైకి ఆడకపోతే, తన ఇంటికి దగ్గర్లో ఉన్న ఢిల్లీకి ఆడతానని చెప్పుకొచ్చాడు...

అయితే ఐపీఎల్‌ 2022లో వస్తున్న కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో... సురేష్ రైనాని కొనుగోలు చేసి, కెప్టెన్‌గా నియమించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వేలానికి ముందే ‘ఫ్రీ టికెట్’ ద్వారా రైనాని బుక్ చేసుకోవచ్చని టాక్ నడుస్తోంది...
 

click me!