ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, మయాంక్.. మిడిల్ ఆర్డర్‌లోఅయ్యర్, శుబ్‌మన్ గిల్, న్యూజిలాండ్‌తో టెస్టులకి..

First Published Nov 22, 2021, 6:07 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టును టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఇక మిగిలింది టెస్టు సిరీస్. టెస్టులను కూడా క్లీన్ స్వీప్ చేసి, కివీస్ గడ్డ మీద ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో ఉంది భారత జట్టు...

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా మొదటి టెస్టు, డిసెంబర్ 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరగనున్నాయి...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విశ్రాంతి తీసుకున్న భారత సారథి విరాట్ కోహ్లీ, మొదటి టెస్టు ముగిసిన తర్వాత తిరిగి జట్టుతో కలుస్తాడు. తొలి టెస్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు...

సీనియర్ పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలకు టెస్టు సిరీస్ నుంచి కూడా విశ్రాంతి కల్పించింది టీమిండియా. వారి స్థానంలో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్‌లతో కలిసి బాల్ పంచుకుంటాడు...

విరాట్ కోహ్లీ గైర్హజరీతో నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చింది బీసీసీఐ. సీనియర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లతో ఓపెనింగ్ చేయించాలని భావిస్తోంది టీమిండియా...

దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు కెఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్‌కి కూడా ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది... 

అయితే ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో మయాంక్ అగర్వాల్ స్థానంలో ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్ సెటిల్ అయిపోయాడు... శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వ్యవహరించారు...

టెస్టు సిరీస్ నుంచి రోహిత్ శర్మ రెస్టు తీసుకుంటున్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లను ఓపెనర్లుగా పంపాలని నిర్ణయం తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్...

ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసుల్లో ఓపెనర్‌గా ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్‌ను ఐదో స్థానంలో లేదా నాలుగో స్థానంలో ఆడించాలని కసరత్తులు చేస్తోంది. కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా వస్తే, వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్‌కి వస్తాడు..

టూ డౌన్‌లో మొదటి టెస్టులో అజింకా రహానే, రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వస్తారు. మొదటి టెస్టులో శుబ్‌మన్ గిల్‌ను ఐదో స్థానంలో పంపి, రెండో టెస్టులో ఆరో స్థానంలో ప్రయత్నించాలని భావిస్తోంది భారత జట్టు...

దూకుడుగా ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ఈ టెస్టు సిరీస్‌ ఆడడం లేదు. అతని లేని లోటును శుబ్‌మన్ గిల్ తీరుస్తాడని టీమిండియా అంచనా వేస్తోంది. 

ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే వరుసగా విఫలమవుతుండడంతో వారి స్థానాల్లో శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లను ఆడిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ఈ ప్రయోగాలు చేస్తోందట భారత జట్టు...

ఒకవేళ పూజారా, రహానే ఈ టెస్టు సిరీస్‌లో కూడా ఫెయిల్ అయితే, సౌతాఫ్రికా టూర్‌లో వారికి చోటు ఉండడం అనుమానమే... అని టాక్ వినబడుతోంది. పూజారా, రహానే స్థానంలో శ్రేయాస్ అయ్యర్, పృథ్వీషా, శుబ్‌మన్ గిల్ వంటి కుర్రాళ్లను ఆడిస్తే బెటర్... అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

click me!