IND vs NZ: ఇదెక్క‌డి ఫీల్డింగ్ సామి.. చెత్త రికార్డు సాధించిన టీమిండియా

Published : Mar 09, 2025, 06:52 PM IST

India vs New Zealand live: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ కు దిగింది. అయితే, భార‌త జ‌ట్టు చెత్త ఫీల్డింగ్ తో వ‌రుస‌గా క్యాచ్ లు వ‌దిలిపెట్టింది. మ‌రో చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది.   

PREV
14
IND vs NZ: ఇదెక్క‌డి ఫీల్డింగ్ సామి.. చెత్త రికార్డు సాధించిన టీమిండియా
India vs New Zealand

India vs New Zealand live, ICC Champions Trophy 2025 final: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ లో టీమిండియా-న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 

ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ గాయంతో అత‌ని స్థానంలో న్యూజిలాండ్ ఒక మార్పు చేసి ఆల్ రౌండర్ నాథన్ స్మిత్‌ను జట్టులోకి తీసుకుంది. భార‌త జ‌ట్టు ఎలాంటి మార్పు లేకుండా ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చెత్త రికార్డును న‌మోదుచేసింది. 

24
Image Credit: Getty Images

చెత్త ఫీల్డింగ్ తో వ‌రుస‌గా క్యాచ్ లు జార‌విడిచిన భార‌త్

భార‌త జ‌ట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతాలు చేస్తూ బ‌ల‌మైన జ‌ట్టుగా కొన‌సాగుతోంది. అయితే, ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న టీమిండియా.. ఫీల్డింగ్ లో మాత్రం తేలిపోతోంది. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్ ల‌లో టీమిండియా ఫీల్డింగ్ లో త‌ప్పిదాలు చేస్తూనే ఉంది. 

ఈ క్ర‌మంలోనే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు వదిలివేసిన జట్టుగా భారత్ చెత్త రికార్డును అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ పేలవమైన ఫీల్డింగ్ కనిపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా మొత్తం నలుగురు ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేశారు.

34

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ లో 4 క్యాచ్ లు వ‌దిలేసిన భార‌త్  

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త్ మొత్తం 11 క్యాచ్‌లను వదిలేసింది. దీంతో ఈ ఐసీసీ టోర్న‌మెంట్ లో అత్య‌ధిక క్యాచ్ లు వ‌దిలేసిన జ‌ట్టుగా చెత్త రికార్డును సాధించింది. దారుణ‌మైన ఫీల్డింగ్ విష‌యంలో భార‌త్ మొద‌టి స్థానంలో ఉంది. భార‌త్ త‌ర్వాత చెత్త ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన టీమ్స్ లో త‌ర్వాతి స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు ఉన్నాయి. 

న్యూజిలాండ్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్  7వ ఓవర్ మూడో బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను మహ్మద్ షమీ వదిలేశాడు. 8వ ఓవర్ మొదటి బంతికి శ్రేయాస్ అయ్యర్ డీప్ మిడ్‌వికెట్‌లో రచిన్ రవీంద్ర క్యాచ్‌ను వదిలివేశాడు. అలాగే, 35వ ఓవర్ 5వ బంతికి రోహిత్ శర్మ మిడ్‌వికెట్ వద్ద డారిల్ మిచెల్ క్యాచ్‌ను జారవిడిచాడు. 36వ ఓవర్ చివరి బంతికి డీప్ మిడ్‌వికెట్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్ ను శుభ్‌మన్ గిల్ వ‌దిలిపెట్టాడు. దీంతో న్యూజిలాండ్ కు మంచి అవ‌కాశం ల‌భించింది. 250+ ప‌రుగులు చేసింది. 

44
Image Credit: Getty Images

రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు న‌మోదు 

ఈ మ్యాచ్ లో భార‌త మ‌రోసారి టాస్ ఓడిపోయింది. దీంతో వ‌రుస‌గా 15 సార్లు టాస్ ఓడిన జ‌ట్టుగా నిలిచింది. అలాగే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 12 టాస్‌లు ఓడిపోయాడు. అత్య‌ధిక టాస్ లు ఓడిన కెప్టెన్ గా బ్రియాన్ లారా రికార్డును స‌మం చేశాడు. వ‌రుస‌గా 12వ టాస్ ఓటమితో రోహిత్ శ‌ర్మ‌ అక్టోబర్ 1998 - మే 1999 మధ్య  వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా టాస్ ఓట‌మి రికార్డును స‌మం చేశాడు.

ఈ జాబితాలో నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్ బోరెన్ కూడా ఉన్నాడు. అత‌ను మార్చి 2011-ఆగస్టు 2013 మధ్య 11 టాస్‌లు ఓడిపోయాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ టాస్  ఓడిపోయాడు. అప్ప‌టి నుంచి రోహిత్ టాస్ లు ఓడిపోతూనే ఉన్నాడు. అయితే, రోహిత్ టాస్ లు ఓడినా భార‌త్ జ‌ట్టు విజ‌యాల జోరు ఆగ‌డం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories