IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ ఎంత?

Published : Mar 09, 2025, 04:15 PM ISTUpdated : Mar 09, 2025, 04:20 PM IST

Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ లు తలపడుతున్నాయి. అయితే, గెలిచిన టీమ్, ఓడిన టీమ్ ఎంత ప్రైజ్ మనీ అందుకుంటాయో తెలుసా? 

PREV
14
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రైజ్ మనీ ఎంత?

Champions Trophy 2025 Prize Money: మినీ ప్రపంచ కప్ అని పిలువబడే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సిరీస్ ముగింపు దశకు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఇరు జట్లు గెలుపుకోసం పోరాడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ కు దిగింది. బౌలర్లు భారత్ కు శుభారంభం అందించారు. గత 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్, ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

24
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంత

అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీని ఎవరు గెలుస్తారో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో అందించే ప్రైజ్ మనీ ఎంత? గెలిచిన టీమ్, ఓడిన టీమ్ ఎంత అందుకుంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తాన్ని 53% పెంచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో కప్పు గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.20 కోట్లు) బహుమతిగా లభిస్తుంది. అంటే ఈ ఐసీసీ టోర్నీలో గెలిచిన జట్టు మొత్తం రూ.20 కోట్లు గెలుచుకుంటుంది.

34
భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్

రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 9.72 కోట్లు) లభిస్తాయి. సెమీఫైనల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు ఒక్కొక్క టీమ్ కు 560,000 డాలర్లు (రూ. 4.86 కోట్లు) లభిస్తాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్ మనీ 6.9 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.60 కోట్లు) పెరిగింది.

ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ప్రతి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు 34,000 డాలర్లు (రూ.30 లక్షలు) లభిస్తాయి. ఐదవ, ఆరవ స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి 3,50,000 డాలర్లు (సుమారు రూ.3 కోట్లు) లభిస్తాయి. 

44
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్

ఏడవ, ఎనిమిదవ స్థానాల్లో నిలిచిన జట్లకు 1,40,000 డాలర్లు (సుమారు రూ.1.2 కోట్లు) లభిస్తాయి. ఈ సిరీస్‌లో పాల్గొన్న ఎనిమిది జట్లకు పోటీలో పాల్గొన్నందుకు కనీసం 1,25,000 డాలర్లు (రూ.1.08 కోట్లు) లభిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories