IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్‌.. ఈ 4 కివీస్ బ్యాట్స్‌మెన్ తోనే భార‌త్ కు ప్ర‌మాదం !

Published : Mar 09, 2025, 09:57 AM IST

Champions Trophy 2025 IND vs NZ: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ కు భారత్ vs న్యూజిలాండ్ సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ మ్యాచ్ లో భార‌త్ నుంచి ట్రోఫీని లాక్కునే ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌గ‌ల న‌లుగురు కీవీస్ ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్‌.. ఈ 4 కివీస్ బ్యాట్స్‌మెన్ తోనే భార‌త్ కు ప్ర‌మాదం !
Rachin Ravindra and Kane Williamson (Photo: @Blackcaps/X)

Champions Trophy 2025 India vs New Zealand: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ఫైన‌ల్ లో భారత్ - న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్‌లో జరుగుతుంది. టైటిల్ పోరు కోసం రెండు జట్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన టోర్నమెంట్‌ను పరిశీలిస్తే రెండు జ‌ట్లు చాలా బ‌లంగా క‌నిపిస్తున్నాయి.

గ్రూప్ మ్యాచ్ లో భార‌త్ చేతిలో ఓడిపోయిన‌ప్ప‌టికీ న్యూజిలాండ్ చాలా బ‌ల‌మైన జ‌ట్టు. భారత్‌కు ట్రోఫీని అంద‌కుండా చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయ‌ర్లు ఆ జ‌ట్టులో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు, న్యూజిలాండ్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఫైన‌ల్ మ్యాచ్ లో కీల‌కం కానున్న నలుగురు కీవీస్ బ్యాట్స్‌మెన్లు ఎవ‌రు? ఎందుకు వారితో భార‌త్ కు ప్ర‌మాదం ఉంద‌నే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

25

1. రచిన్ రవీంద్ర: 

న్యూజిలాండ్ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర భార‌త జ‌ట్టుకు చాలా ప్రమాదకరమని ఫైన‌ల్ మ్యాచ్ లో నిరూపించవచ్చు. ఈ టోర్నమెంట్‌లో రచిన్ ర‌వీంద్ర‌ రికార్డు ఇన్నింగ్స్‌లు ఆడి ప్రత్యర్థి జట్లను దెబ్బ‌కొట్టాడ ఉ. ఈ టోర్నమెంట్‌లో రచిన్ 3 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు చేశాడు. టోర్నీలో టాప్ స్కోర‌ర్ల‌లో అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు. ఒత్తిడి స‌మ‌యంలోనూ ప‌రుగులు రాబ‌ట్ట‌గ‌ల‌డు. అలాగే, భార‌త్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొనే సామ‌ర్థ్యం ఉన్న న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ ర‌చిన్ ర‌వీంద్ర‌.   

35
Kane Williamson. (Photo- Blackcaps X/@BLACKCAPS X)

2. కేన్ విలియమ్సన్:

రచిన్ ర‌వీంద్ర‌ కాకుండా న్యూజిలాండ్ లో భార‌త జ‌ట్టుకు పెద్ద విల‌న్ కేన్ విలియమ్సన్. అత‌ను కూడా కూడా భారత్ ట్రోఫీ గెల‌వ‌కుండా ముందు గోడగా మారగల బ్యాట్స్‌మన్. టీమిండియా బలం స్పిన్నర్లే కానీ విలియమ్సన్ స్పిన్ ఆడటంలో గొప్ప ప్లేయ‌ర్.  కేన్ విలియమ్సన్ భార‌త జ‌ట్టుపై గ్రూప్ మ్యాచ్ లో  81 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, త‌ర్వాతి మ్యాచ్ లో అంటే సెమీ-ఫైనల్స్ లో సౌతాఫ్రికాపై అద్భుతమైన సెంచరీ సాధించాడు.  కాబ‌ట్టి భారత జట్టు బౌలర్లు వీలైనంత త్వ‌ర‌గా కేన్ విలియ‌మ్స‌న్ ను క్రీజునుంచి పెవిలియ‌న్ కు పంపాలి. లేదంటే చేయాల్సిన నష్టం చేస్తాడు.

45
Glenn Phillips

3. గ్లెన్ ఫిలిప్స్: 

న్యూజిలాండ్ విధ్వంసక బ్యాట్స్‌మన్ గ్లెన్ ఫిలిప్స్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను ఒంటిచేత్తో ఓడించగల సామర్థ్యం కలిగి ప్లేయ‌ర్. గ్లెన్ ఫిలిప్స్ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో వ‌రుస‌గా  ఒకదాని తర్వాత ఒకటి పేలుడు ఇన్నింగ్స్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో 49 పరుగులతో అజేయంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీయడానికి  భార‌త బౌలర్లు మ‌రింత‌గా ప్రయత్నించాల్సి ఉంటుంది.

55
Image Credit: Getty Images

4. డారిల్ మిచెల్: 

గ్లెన్ ఫిలిప్స్ లాగే, డారిల్ మిచెల్ కూడా న్యూజిలాండ్ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్న బ్యాట్స్ మెన్. సెమీఫైనల్లో మిచెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును ప‌రుగులు పెట్టించాడు. అత‌ని ఇన్నింగ్స్ తో గత మ్యాచ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కివీస్ జట్టు సృష్టించింది. కివీస్ జట్టు 362 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను దెబ్బతీయాలంటే భారత బౌలర్లు రాణించాలి. లేకుండా కీవీస్ తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేయ‌డం ప‌క్కా. ఇక రెండో ఇన్నింగ్స్  బ్య‌టింగ్ స‌మ‌యంలో పిచ్ మ‌రింత స్లోగా మారుతుంది. కాబ‌ట్టి టార్గెట్ చేధ‌న మ‌రింత క‌ష్టంగా మారుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories