టీ20 వరల్డ్‌కప్ 2021 పరాభవం తర్వాత న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో మంచి విజయాన్ని నమోదుచేసింది భారత జట్టు. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో 5 వికెట్ల తేడాతో ఉత్కఠ విజయాన్ని అందుకుంది...
టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కి 50 పరుగులు, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కి 59 పరుగులు జోడించి... కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు...
213
36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
313
ట్రెంట్ బౌల్ట్ వేసిన స్లో బౌన్సర్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రోహిత్ శర్మ, షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్‌లో చేస్తున్న రచిన్ రవీంద్రకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
413
‘నేను, ట్రెంట్ బౌల్డ్ కలిసి కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం. నెట్స్‌లో అతని బౌలింగ్‌ని చాలా సార్లు ఎదుర్కొన్నాను. నా వీక్‌నెస్‌లు ఏంటో అతనికి బాగా తెలుసు. అలాగే అతని బలాలేంటో కూడా నాకు తెలుసు...
513
మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంటుంది. ముంబై ఇండియన్స్ తరుపున ఆడేటప్పుడు అతనికి నేను కెప్టెన్‌ని. ఆ సమయంలో వికెట్లు ఎలా తీయాలో చాలాసార్లు సలహాలు ఇస్తుంటా...
613
అప్పుడు నేను చెప్పిన చిట్కాను వాడే, నన్ను అవుట్ చేశాడు ట్రెంట్ బౌల్ట్... మిడ్ వికెట్ ఫీల్డర్‌ని వెనకాల పెట్టి, ఫైన్ లెగ్ ఫీల్డర్‌ని ముందు పెట్టాడు. అతను ఇలా చేస్తాడని ముందే ఊహించా...
713
ట్రెంట్ బౌల్ట్ బౌన్సర్ వేయబోతున్నాడని గ్రహించా. అయితే ఫీల్డర్ పైనుంచి షాట్ కొట్టాలని ప్రయత్నించా, కానీ స్లోగా రావడంతో అది వెళ్లి ఫీల్డర్ చేతుల్లో పడింది...
813
సూర్యకుమార్ యాదవ్ చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. రన్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకుని, ఎప్పుడు ఎక్కడ దూకుడు పెంచాలో అతనికి బాగా తెలుసు. అతను ఆడిన షాట్స్ చూస్తూ ఉండిపోయా..
913
స్పిన్ బౌలింగ్‌ను సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడతాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ల పేస్‌ను కూడా చక్కగా వాడుకుంటాడు... అందుకే అతను టీమిండియాకి కీలక ప్లేయర్‌గా మారతాడు...
1013
అశ్విన్, అక్షర్ పటేల్.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఎన్నో విజయాలు అందించారు. బౌలింగ్‌కి వచ్చిన ప్రతీసారీ వికెట్ తీయాలని ఆశించారు..
1113
అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి న్యూజిలాండ్ వేగంగా స్కోరు చేయలేకపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...
1213
మొదటి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా... 4 ఓవర్లలో 23 పరుగులిచ్చిన అశ్విన్, ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు...
1313
165 లక్ష్యఛేదనలో ఐదు వికెట్లు కోల్పోయిన భారత జట్టు, 19.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 17 బంతుల్లో 17 పరుగులు చేసి విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ని ముగించాడు.