ఒకే దెబ్బకు రెండు పిట్టలు! మూడో వన్డేలో గెలిస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి టీమిండియా...

First Published Jan 22, 2023, 1:40 PM IST

టీమిండియా చేతిలో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకుని కోల్పోయింది. మూడో వన్డేలో గెలిస్తే టీమిండియా, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా టాప్ ప్లేస్‌కి దూసుకెళ్తుంది...
 

వన్డే సిరీస్ ఆరంభానికి ముందు 117 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉంది న్యూజిలాండ్. ఇంగ్లాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మూడో స్థానంలో, భారత జట్టు 110 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండింది...

Image credit: PTI

తొలి రెండు స్థానాల్లో గెలిచిన టీమిండియా 113 పాయింట్లు సాధిస్తే, రెండో వన్డేలో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ 113 పాయింట్లకు పడిపోయింది. 113 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్, రేటింగ్స్ ఎక్కువగా ఉండడంతో టాప్ ప్లేస్‌కి ఎగబాకింది...
 

మూడో వన్డేలో గెలిస్తే న్యూజిలాండ్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి ఎగబాకుతుంది భారత జట్టు. ఇప్పటికే టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న భారత జట్టు, టెస్టుల్లో రెండో స్థానంలో ఉంది...

Image credit: PTI

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ గెలిస్తే, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా టాప్ ర్యాంక్ టీమిండియాకే దక్కుతుంది. ఇదే జరిగితే చాలా ఏళ్ల తర్వాత మూడు ఫార్మాట్లలో టాప్ ర్యాంకుని దక్కించుకున్న టీమ్‌గా చరిత్ర క్రియేట్ చేస్తుంది రోహిత్ సేన.. 

ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతుంటే విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో ఉన్నాడు. అయితే న్యూజిలాండ్‌తో రెండు వన్డేల్లోనూ ఫెయిలైన కోహ్లీ, మళ్లీ టాప్ 5 నుంచి కిందకి పడిపోయే ప్రమాదం ఉంది.. 

click me!