బ్లూ జెర్సీ కలిసి రావడం లేదు, ఆ ఎల్లో జెర్సీని తిరిగి తేవాలి... వసీం జాఫర్ ట్వీట్...

Published : Nov 23, 2021, 08:05 PM IST

ఇప్పుడు ఎల్లో జెర్సీ టైం నడుస్తోంది. ఈ ఏడాది మూడు నెలల గ్యాప్‌లో టైటిల్స్ గెలిచిన మూడు జట్లు కూడా పసుపు రంగు జెర్సీ ధరించనవే కావడంతో టీమిండియా జెర్సీని కూడా ఎల్లో కలర్‌లో తేవాలని అంటున్నాడు మాజీ క్రికెటర్, కోచ్ వసీం జాఫర్...

PREV
112
బ్లూ జెర్సీ కలిసి రావడం లేదు, ఆ ఎల్లో జెర్సీని తిరిగి తేవాలి... వసీం జాఫర్ ట్వీట్...

టీమిండియాకి కొత్త జెర్సీ ఎప్పుడూ కలిసి రాలేదు. కొత్త జెర్సీతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అడుగుపెట్టింది భారత జట్టు. ఫలితం మొదటి రెండు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం...

212

ఇంతకుముందు వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలోనూ అంతే. ఆరెంజ్ కలర్ జెర్సీలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో రిజల్ట్ తేడా కొట్టేసింది...

312

అప్పటిదాకా అన్ని మ్యాచుల్లోనూ అద్భుత విజయాలు అందుకుని, టేబుల్ టాపర్‌గా ఉన్న టీమిండియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం అందుకుంది.

412

ఇంగ్లాండ్ కూడా వన్డే వరల్డ్‌ కప్ టోర్నీలో బ్లూ జెర్సీతో బరిలో దిగడంతో భారత జెర్సీ రంగు మార్చాల్సిందిగా సూచించింది ఐసీసీ... ఆ మ్యాచ్ ప్రభావం లేకుండా సెమీస్ చేరినా, నాకౌట్‌లో కివీస్ చేతుల్లో ఓడింది...

512

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో గ్రూప్ బీలో ఉన్న భారత జట్టు, ఈజీగా సెమీస్ చేరుతుందని భావించారంతా. ఎందుకంటే గ్రూప్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ మినహా పెద్ద జట్లేమీ లేవు...

612

న్యూజిలాండ్‌పై ఓడిపోయినా, పాక్‌పై ఐసీసీ టోర్నీల్లో ఓడిన చరిత్ర భారత జట్టుకి లేకపోవడంతో టీమిండియా ప్లేఆఫ్స్ చేరడం ఖాయమనుకున్నారంతా. అయితే దాయాది పాకిస్తాన్, భారత్‌కి ఊహించని షాక్ ఇచ్చింది...

712

అదీకాకుండా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఐపీఎల్ 2021 టోర్నీ టైటిల్ సాధించింది. సీఎస్‌కే జెర్సీ కలర్ ఎల్లో...

812

ఆ తర్వాత నవంబర్‌ 14న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, తొలిసారి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఆస్ట్రేలియా టీమ్ జెర్సీ కూడా ఎల్లోనే...

912

తాజాగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఫైనల్‌లో కర్ణాటక జట్టును ఓడించి, టైటిల్ సాధించింది తమిళనాడు. ఇక్కడ తమిళనాడు జెర్సీ కూడా ఎల్లోనే... తమిళనాడుకి 11 నెలల గ్యాప్‌లో రెండో సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ కూడా...

1012

లక్ కోసం భారత జట్టు ధరించిన ఎల్లో కలర్ పాత జెర్సీని తిరిగి తీసుకురావాలని కోరుతూ ట్వీట్ చేశారు మాజీ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్...

1112

2000వ సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో టీమిండియా మ్యాచులు ఆడినప్పుడు ఎల్లో కలర్ జెర్సీలను ధరించింది. బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ తప్ప మిగిలిన ఎవ్వరూ రాణించకపోవడంతో వరుసగా మ్యాచుల్లో ఓడింది భారత జట్టు...

1212

అయితే ఇప్పుడు ఎల్లో కలర్ టైం నడుస్తుండడంతో వచ్చే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా, ఈ రెట్రో జెర్సీని తిరిగి తీసుకువస్తే బాగుంటుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!

Recommended Stories