టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది టీమిండియా. పొట్టి ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడింది భారత జట్టు. ఈ ఓటమిపై టీమిండియాపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ సెంచరీ నమోదు చేశాడు...
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్ ఓటమి తర్వాత జరుగుతున్న మొదటి మ్యాచ్‌లోనే సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. టీ20 వరల్డ్ కప్ పరాజయాన్ని మరిపించేందుకే సూర్యతో సెంచరీని అస్త్రంగా వాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్...
26
అంతకుముందు ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా టీమిండియా ఇలాంటి ట్రిక్‌నే వాడింది. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో వరుసగా రెండు ఓటములు చవిచూసింది భారత జట్టు. ఈ పరాజయాలతో టీమిండియా, ఆసియా కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది...
36
Image Credit: Anushka Sharma Instagram
టీమిండియా ఓటమిపై తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేశాడు. మూడేళ్లుగా సెంచరీ మార్కు అందుకోని విరాట్ కోహ్లీ, కెరీర్‌లో 71వ శతకాన్ని నమోదు చేశాడు. కోహ్లీ సెంచరీ దెబ్బకు అప్పటిదాకా ఆసియా కప్ పరాజయం గురించి జరిగిన చర్చ అంతా అటకెక్కింది...
46
Virat Kohli-Suryakumar Yadav
విరాట్ కోహ్లీ సెంచరీ గురించే ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలెట్టారు. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
56
ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ, టీ20 కెప్టెన్సీని హార్ధిక్ పాండ్యాకి అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీమిండియా, వరల్డ్ కప్ పరాభవం గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలోనే న్యూజిలాండ్‌పై సెంచరీ బాదాడు...
66
చూస్తుంటే ఘోర పరాభవాల తర్వాత అభిమానులను చల్లార్చేందుకు సెంచరీలను అస్త్రాలుగా వాడుతున్నట్టుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. ఈ సెంచరీలేదో సెమీ ఫైనల్‌లో, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేసి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు..