వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత కెప్టెన్‌ని మారుస్తారు! అందుకే ఇదంతా... దినేశ్ కార్తీక్ కామెంట్...

First Published Jan 29, 2023, 9:36 AM IST

వన్డే వరల్డ్ కప్ 2019 తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లకు వరుస అవకాశాలు దక్కాయి. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20ల నుంచి దూరంగా ఉంటున్నారు...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు కెఎల్ రాహుల్‌ని కూడా టీ20 ఫార్మాట్ నుంచి దూరం పెట్టింది టీమిండియా. వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఈ ఏడాది ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు...

ఈ రెండు కీలక టోర్నీలకు సీనియర్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారిని టీ20 ఫార్మాట్ నుంచి తప్పించి విశ్రాంతి కల్పించింది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్టేనని వార్తలు వచ్చాయి...

అయితే రోహిత్ శర్మ మాత్రం టీ20 ఫార్మాట్‌ని వదిలి వేయలేదని, ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని కామెంట్ చేశాడు. రోహిత్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే బీసీసీఐ బలవంతంగా సీనియర్లను పొట్టి ఫార్మాట్‌కి దూరం పెట్టినట్టు తెలుస్తోంది...

‘ఇప్పుడు టీ20లకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. ఇకపై అతనికి మళ్లీ టీ20 కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు భారత జట్టు కేవలం 3 టీ20 మ్యాచులు మాత్రమే ఆడబోతోంది...

ఐపీఎల్ ముగిసిన తర్వాత వెస్టిండీస్‌తో 3 టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది. కాబట్టి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత బీసీసీఐ, టీ20లకు హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ప్రకటించవచ్చు...

Image credit: PTI

రోహిత్ శర్మ, వన్డే వరల్డ్ కప్ గెలవకపోతే వన్డే కెప్టెన్సీ కూడా హార్ధిక్‌కే పోతుంది. వైట్ బాల్ కెప్టెన్సీ నిలవాలంటే రోహిత్ మ్యాజిక్ చేయాల్సిందే. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ సమయానికి రోహిత్ శర్మ... టీ20 ఫార్మాట్ ఆడతాడో లేదో తెలీదు...

ఇప్పటికైతే రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. బౌలర్లను ఎలా వాడుకోవాలో హార్ధిక్ పాండ్యాకి బాగా తెలుసు. ముఖ్యంగా కీలక మ్యాచుల్లో ముందుండి నడిపిస్తున్నాడు. 

Image credit: PTI

విరాట్ కోహ్లీ తర్వాత కీలక మ్యాచుల్లో నిలబడగల ప్లేయర్ హార్ధిక్ పాండ్యా మాత్రమే. బుమ్రా కూడా ఈ లిస్టులోకి వస్తాడు కానీ పాండ్యా ఆడే విధానం వేరే లెవెల్. అందుకే ద్వైపాక్షిక సిరీసుల్లో పాండ్యా నుంచి భారీ ఇన్నింగ్స్‌లు కనిపించవు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్...

click me!