అతని కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఎంట్రీ... ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో కెప్టెన్‌గా...

First Published Nov 17, 2021, 3:16 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగియడంతోనే టీమిండియాలో ఓ కొత్త శకానికి నాంది పడింది. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు...

ఒకే టీమ్‌లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉంటే, ఎవరో ఒకరు ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. రోహిత్ శర్మ పరిస్థితి కూడా అదే. విరాట్ కోహ్లీ ఆరంగ్రేటం నుంచే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో మిగిలిన ప్లేయర్లను డామినేట్ చేశాడు...

లేట్‌గా అయినా వన్డేల్లో డబుల్ సెంచరీలు, టీ20ల్లో సెంచరీల మోతతో టీమిండియాలో స్టార్‌గా ఎదిగాడు రోహిత్ శర్మ. విరాట్ కంటే ముందుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ...

కోచ్ గ్రెగ్ ఛాపెల్‌ శిక్షణలో కెప్టెన్‌గా ఎందరో యువ ఆటగాళ్లకు టీమ్‌లో చోటు కల్పించాడు అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్. అలా టీమ్‌లోకి వచ్చిన వారిలో రోహిత్ శర్మ కూడా ఒకడు. 

2007 జూన్ 23న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా మొదటి మ్యాచ్ ఆడబోతున్నాడు...

‘ఒకప్పుడు క్రీజులో రాహుల్ ద్రావిడ్ ఉంటే, టీమిండియా బ్యాటింగ్‌పై కాస్త నమ్మకం ఉండేది. ద్రావిడ్ క్రీజులో ఉన్నంతవరకూ భారత జట్టుకి ఎలాంటి నష్టం ఉండదనే భరోసా కలిగేది...

ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా మారిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ కూడా ‘ది వాల్’గా పటిష్టంగా తయారవుతుందని ఆశిస్తున్నాను...

రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఇద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. క్రీజులో ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపిస్తారు. ద్రావిడ్ లాగే రోహిత్ కూడా చాలా కామ్‌...

ఒకేలా ఆలోచించే ఇద్దరు వ్యక్తులు కలిస్తే, అద్భుతాలు సాధించవచ్చని నా నమ్మకం....’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

‘రాహుల్ ద్రావిడ్ చాలా సక్సెస్‌ఫుల్ ప్లేయర్, అలాగే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా. ఇప్పుడు ఆయన టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కోచ్ కూడా అవుతాడని ఆశిస్తున్నా...

డ్రెస్సింగ్ రూమ్‌లో రాహుల్ ద్రావిడ్ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే జట్టుకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ద్రావిడ్ 100కు పైగా టెస్టులు ఆడాడు. కెప్టెన్‌గా చేశాడు...

అన్నింటికీ మించి రాహుల్ ద్రావిడ్ విలువలకు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తాడు. కష్టపడి పనిచేసే వారికి ద్రావిడ్ ఎప్పుడూ అవకాశాలు ఇస్తాడు. అవన్నీ ఇప్పుడు భారత జట్టు పర్ఫామెన్స్‌లో కనిపించాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

‘రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పగానే నాకు ముందుగా గుర్తొచ్చే మాట ప్రాసెస్, ప్లానింగ్, ప్రణాళికను అమలు చేయడం... అతను ఓ ప్రణాళికతో ముందుకి వెళ్తాడు. ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బీతో సిద్ధంగా ఉంటాడు...

యుద్ధాన్ని గెలవడానికి కావాల్సిన మానసిక ఘర్షణ ద్రావిడ్‌లో కనిపిస్తుంది. రోహిత్‌లో కూడా నాకు ఇలాంటి లక్షణాలే కనిపించాయి. ఇద్దరూ అదరగొట్టాలని కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

click me!