ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో విరాట్ కోహ్లీపై నోరుపారేసుకున్న భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మరోసారి టీమిండియా మాజీ కెప్టెన్‌ని టార్గెట్ చేశాడు... కోహ్లీ ఫ్యాన్స్ నుంచి బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న వీరూ, మూడో టీ20 మ్యాచ్ తర్వాత చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది...
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 1 పరుగు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టీ20లో ఓ ఫోర్, ఓ సిక్సర్ బాది ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. రెండు మ్యాచుల్లో కలిపి 12 పరుగులు మాత్రమే చేశాడు విరాట్ కోహ్లీ...
28
Deepak Hooda
అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీ చేసిన దీపక్ హుడా, అంతకుముందు శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌లకు మూడో టీ20 జట్టులో చోటు దక్కలేదు...
38
Rahul Tripathi
ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి వంటి ప్లేయర్లు... భారత తుది జట్టులో ప్లేస్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు..
48
‘ఫస్ట్ బాల్ నుంచి బౌండరీలు బాదగల చాలామంది బ్యాట్స్‌మెన్‌లు భారత్‌లో ఉన్నారు. అయితే వారిలో చాలామంది రిజర్వు బెంచ్‌లో కూర్చుంటున్నారు... టీ20 క్రికెట్‌లో ఫామ్‌లో ఉన్న ప్లేయర్లతో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్‌ని తయారుచేసేందుకు మార్గాలు వెతకాలి..’ అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
58
డైరెక్టుగా విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించకపోయినా ఫామ్‌లో లేని ప్లేయర్ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ గురించే ఈ ట్విట్ చేసినట్టు అర్థమవుతోంది. దీంతో సెహ్వాగ్‌ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
68
2021లో రోహిత్ శర్మ 18 మ్యాచులు లాడిన రోహిత్ శర్మ, 564 పరుగులు మాత్రమే చేయగలిగాడని... ఈ ఏడాదిలో అతను ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు...
78
ఫామ్‌లో ఉన్న ప్లేయర్లనే ఆడించాలని చెబుతున్న వీరేంద్ర సెహ్వాగ్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో తనని తప్పించి, రోహిత్ శర్మను ఓపెనర్‌గా మార్చినప్పుడు ఎందుకు మాహీపై ఆగ్రహం వ్యక్తం చేశాడని కామెంట్లు పెడుతున్నారు...
88
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లకు దక్కుతున్న గౌరవం, అవకాశాలను చూసి వీరేంద్ర సెహ్వాగ్ కుళ్లుకుంటున్నాడని, తనకి అన్ని అవకాశాలు రాలేదనే కోపంతో ఇలా మాట్లాడుతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు...