మూడేళ్లుగా విరాట్ కోహ్లీ వల్ల కావట్లే! ఇప్పుడు రోహిత్ శర్మ కూడా... రికీ పాంటింగ్ చేతబడి చేస్తూ...

Published : Jul 11, 2022, 10:21 AM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యం చూపించింది ఆస్ట్రేలియా జట్టు... రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్, తన రికార్డులు ఎవ్వరూ అందుకోకుండా చేతబడి చేస్తున్నాడా? అవుననే అంటున్నారు కొందరు నెటిజన్లు..

PREV
110
మూడేళ్లుగా విరాట్ కోహ్లీ వల్ల కావట్లే! ఇప్పుడు రోహిత్ శర్మ కూడా... రికీ పాంటింగ్ చేతబడి చేస్తూ...

టీమిండియా కెప్టెన్‌గా వరుసగా 19 మ్యాచుల్లో నెగ్గిన రోహిత్ శర్మ, పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో తొలి పరాజయాన్ని అందుకున్నాడు. వరుసగా 19 మ్యాచుల్లో నెగ్గిన రోహిత్, మరో మ్యాచ్ నెగ్గి ఉంటే... వరుసగా అత్యధిక మ్యాచులు నెగ్గిన కెప్టెన్‌గా రికార్డు అందుకునేవాడే...

210

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వరుసగా 20 మ్యాచుల్లో నెగ్గి, వరుసగా అత్యధిక మ్యాచులు నెగ్గిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ ఆ రికార్డుకు అత్యంత చేరువగా వచ్చినా మూడో టీ20లో టీమిండియా ఓటమితో ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు...

310

టీ20ల్లో వరుసగా 14 మ్యాచుల్లో గెలిచిన రోహిత్ శర్మ, పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత వరుసగా 16 మ్యాచుల్లో నెగ్గుతూ వచ్చాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ గైర్హజరీలో ఆసియా కప్ టోర్నీకి సారథిగా వ్యవహరించాడు రోహిత్.. 

410

అలాగే అంతర్జాతీయ కెరీర్‌లో జెట్ స్పీడ్‌లో 70 సెంచరీలు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. అయితే 71వ సెంచరీ మార్కు అందుకోవడానికి రెండున్నరేళ్లుగా అపసోపాలు పడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 100 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రెండో స్థానంలో ఉన్నాడు రికీ పాంటింగ్...

510

రికీ పాంటింగ్ తన కెరీర్‌లో 71 సెంచరీలు నమోదు చేయగా, ఆ రికార్డును అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడని అనుకున్న విరాట్ కోహ్లీ, రెండున్నరేళ్లుగా రికీ పాంటింగ్ రికార్డును కూడా సమం చేయలేకపోతున్నాడు...

610

71వ సెంచరీ తర్వాత దాదాపు డజను సార్లు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ... సెంచరీకి చేరువగా వచ్చినా ఆ మ్యాజిక్ ఫిగర్‌ని మాత్రం అందుకోలేక రికీ పాంటింగ్ వెనకాలే ఉండిపోయాడు...
 

710

కెప్టెన్‌గా అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన సారథిగా రికీ పాంటింగ్ టాప్‌లో ఉన్నాడు. రికీ పాంటింగ్ కెప్టెన్‌గా ఉంటూ 28 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవగా, విరాట్ కోహ్లీ 27 సార్లు ఈ ఫీట్ సాధించాడు...

810
ponting kohli

విరాట్ కోహ్లీ మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిస్తే రికీ పాంటింగ్ రికార్డు సమం చేసేవాడే. అయితే ఆ రికార్డును అందుకోవడానికి ముందే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో రికీ పాంటింగ్ రికార్డు సేఫ్ అయిపోయింది...

910

వన్డేల్లో రికీ పాంటింగ్ 30 సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం 29 సెంచరీలతో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రెండేళ్లుగా వన్డేల్లో ఆడడమే తగ్గిపోయింది.. దీంతో రిక పాంటింగ్ రికార్డు ఏడాదిగా సేఫ్‌గా ఉంది...

1010

చూస్తుంటే రికీ పాంటింగ్ తన రికార్డులను కాపాడుకోవడానికి భారత ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై చేతబడి చేస్తున్నట్టు ఉన్నాడని, లేకపోతే అతనికి దగ్గరగా రాగానే ఇలా రిజల్ట్ మారిపోవడం ఏంటని.. మీమ్స్ వైరల్ చేస్తున్నారు టీమిండియా అభిమానులు... 

Read more Photos on
click me!

Recommended Stories