మా కోహ్లీ గురించి మాకు తెలీదా! వాళ్లని అలా ఎందుకు పిలుస్తారో... కెప్టెన్ రోహిత్ శర్మ...

Published : Jul 11, 2022, 09:46 AM IST

శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ వంటి యంగ్ ప్లేయర్ల రాకతో విరాట్ కోహ్లీకి టీ20 టీమ్‌లో ప్లేస్ ఉండదని చాలా మంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అజయ్ జడేజా, కపిల్‌దేవ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు... తాజాగా ఈ వార్తలపై తన స్టైల్‌లో స్పందించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ...

PREV
17
మా కోహ్లీ గురించి మాకు తెలీదా! వాళ్లని అలా ఎందుకు పిలుస్తారో... కెప్టెన్ రోహిత్ శర్మ...

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 1 పరుగు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో టీ20లో 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... రెండు టీ20ల్లో కలిపి 12 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడకపోవచ్చని వార్తలు వినిపించాయి..

27
kohli rohit

విరాట్ కోహ్లీ గైర్హజరీలో టీమ్‌లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో దుమ్మురేపాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు.. ఫామ్‌లో లేని విరాట్ కంటే ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడాలను ఆడించాలని కామెంట్ చేశాడు భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...

37

‘బయటి వ్యక్తులు ఏం అనుకుంటున్నారో మేం పట్టించుకోం. ఎందుకంటే ఎక్స్‌పర్ట్స్‌ ఏం అనుకుంటున్నారో మాకు అనవసరం. అసలు వారిని ఎక్స్‌పర్ట్ అని ఎందుకు పిలుస్తారో కూడా నాకు అర్థం కాదు... 

47
Image credit: Getty

బయటి నుంచి మ్యాచ్‌ చూసేవాళ్లకి టీమ్‌లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది. టీమ్‌ సెలక్షన్ విషయంలో చాలా చర్చ జరుగుతుంది. టీమ్‌లో చాలా చర్చ జరుగుతుంది. బయటి వ్యక్తుల అభిప్రాయాలు మాకు అనవసరం..

57

ప్రతీ ఒక్క ప్లేయర్‌కి ఇలాంటి పరిస్థితి వస్తుంది. నేను కూడా ఇలాంటి టైమ్‌ ఫేస్ చేశాను. కానీ కొన్ని ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్న ప్లేయర్‌ సత్తా ఏంటో మాకు తెలుసు. ఒక్క సిరీస్‌లో ఆడలేదని, లేదా కొన్ని నెలలుగా ఆడడం లేదని అతన్ని పక్కనబెట్టలేం...
 

67

టాలెంట్ ఉన్న ప్లేయర్లకు సపోర్ట్ అవసరం. ఫామ్‌లో లేనప్పుడు వారిని బ్యాక్ చేస్తే, మరింత మెరుగ్గా కమ్‌బ్యాక్ ఇస్తారు. ఆ ప్లేయర్‌ జట్టుకి ఎంత అవసరమో జట్టుని లీడ్ చేస్తున్న నాకు తెలుసు...

77

బయటి వ్యక్తులకు టీమ్ గురించి అభిప్రాయాలు చెప్పే హక్కు ఉండొచ్చు కానీ లోపల ఏం జరగాలో కూడా వాళ్లే డిసైడ్ చేయలేరుగా.. మాకు మాత్రం ఏ ప్లేయర్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...

Read more Photos on
click me!

Recommended Stories