ప్రారంభంలో కష్టాల్లో పడిన భారత్.. కానీ చివరకు మంచి స్కోరు
పూణెలో, భారత్ స్కోరు 100 కంటే ముందే ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చురుగ్గా సాగిన తర్వాత అందరి టార్గెట్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ పై పడింది. కానీ, ఈ మొత్తం సిరీస్‌లో ఇద్దరూ ఫ్లాప్‌గా కనిపించారు. శాంసన్ గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా సింగిల్ డిజిట్‌లో అవుటయ్యాడు.
అయితే, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు భారత జట్టుకు మంచి స్కోర్ అందించారు. అద్భుతమైన షాట్స్ ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు కొట్టారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నోలుక్స్ సిక్సర్లు అద్భుతంగా బాదాడు. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 53 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.