india vs england: హాఫ్ సెంచ‌రీల‌తో దుమ్మురేపిన‌ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే

Published : Jan 31, 2025, 09:39 PM IST

india vs england: ఇంగ్లాండ్ తో జ‌రిగిన నాల్గో టీ20 మ్యాచ్ లో వ‌రుస‌గా వికెట్లు కోల్పోతున్న స‌మ‌యంలో అద్భుత‌మైన ఆట‌తో హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబేలు హాఫ్ సెంచ‌రీల‌తో భార‌త్ కు మంచి స్కోర్ అందించారు.   

PREV
15
india vs england: హాఫ్ సెంచ‌రీల‌తో దుమ్మురేపిన‌ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే
Image Credit: Getty Images

India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నాల్గో టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రింకూ సింగ్, శివ‌మ్ దూబేలు వ‌చ్చారు. 

25

ఒకే ఓవ‌ర్ లో మూడు వికెట్లు తీసిన మహమూద్ 

తొలుత బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు వ‌రుస‌గా షాక్ లు త‌గిలాయి. రెండో ఓవర్లోనే భార‌త జ‌ట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. సంజూ శాంస‌న్ త్వ‌ర‌గానే పెవ‌లియ‌న్ కు చేరాడు. ఈ మ్యాచ్‌లో కూడా సంజూ శాంస‌న్ కేవలం 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్ కు వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ భారీ షాట్ ఆడి మొదటి బంతికే వికెట్ కోల్పోయాడు.

అదే ఓవ‌ర్ లో భార‌త కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా పెవిలియ‌న్ బాట‌ప‌ట్డాడు. దీంతో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన మహమూద్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి భార‌త్ ను దెబ్బ‌కొట్టాడు. భారత్ కేవలం 12 పరుగుల వద్ద ముగ్గురు టాప్ బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది.

35

రింకూ సింగ్ సూప‌ర్ షాట్స్  

కీల‌క ప్లేయ‌ర్లు ఔట్ అయిన త‌ర్వాత టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్, అభిషేక్ శర్మలు భార‌త ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు భారత జట్టు స్కోరును 50 ప‌రుగులు దాటించారు. అయితే, ర‌న్ రేట్ త‌గ్గ‌డంతో అప్ప‌టినుంచే మ్యాచ్‌పై ఇంగ్లిష్ జట్టు పట్టు బిగిస్తున్నట్లు కనిపించింది. 

గత మ్యాచ్ లో మెరిసిన ఆదిల్ రషీద్.. అభిషేక్ శర్మ (29 ప‌రుగులు) ను తన వలలో బంధించాడు. భారత జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 65 పరుగులకు చేరింది. దీంతో అందరి చూపు రింకూ సింగ్ పై ప‌డింది. ఉన్నంత‌సేపు దూకుడుగా ఆడిన రింకూ సింగ్ 30 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు. 

45
Shivam Dube

హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు దుమ్మురేపారు 

ఆ త‌ర్వాత హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబేలు భార‌త జ‌ట్టును స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. అద్భుత‌మైన షాట్స్ ఆడుతూ ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు సాధించారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ గ‌త మ్యాచ్ లో నెమ్మ‌దిగా ఆడాడ‌నే విమ‌ర్శ‌ల‌కు స‌మాధాన‌మిచ్చిన‌ట్టు భారీ షాట్లు ఆడారు. వీరిద్ద‌రూ ఇండియాను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చాడు.

కానీ ఫిఫ్టీ కొట్టిన వెంటనే భార‌త్ హార్దిక్  వికెట్ కోల్పోయింది. హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  హార్దిక్ పాండ్యా 53 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు.

55

హార్దిక్ పాండ్యా ఔట్ అయిన త‌ర్వాత శివ‌మ్ దూబే మంచి షాట్స్ ఆడుతూ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 53 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ దూబే 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. అప్ప‌టికే భార‌త జ‌ట్టు స్కోరు 150+ మార్కును దాటేసింది. 

20 ఓవ‌ర్ల‌లో భార‌త్ 9 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ల‌లో సాకిబ్ మహమూద్ 3 వికెట్లు, జామీ ఓవర్టన్ 2 వికెట్లు తీసుకున్నారు. వీరితో పాటు బ్రైడన్ కార్సే, ఆదిల్ ర‌షీద్ లు చెరో ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories