యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తొలి రోజు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగింది. మొదట జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేశాడు. ఈ ప్రదర్శనతో అతను ఆసీస్, ఇంగ్లాండ్‌లో తొలి టెస్టుల్లో సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్ట్‌లోనే శతకం సాధించి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి టెస్ట్ కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. భారత్ తరఫున కెప్టెన్‌గా తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో గిల్ నాలుగో స్థానంలో చేరాడు.
• విజయ్ హజారే: 164* vs ఇంగ్లాండ్, ఢిల్లీ, 1951
• సునీల్ గవాస్కర్: 116 vs న్యూజిలాండ్, ఆక్‌ల్యాండ్, 1976
• విరాట్ కోహ్లీ: 115 vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 2014
• శుభ్‌మన్ గిల్: 127* vs ఇంగ్లాండ్, లీడ్స్, 2025