ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ సృష్టించిన పరుగుల ప్రవాహాన్ని, ఇప్పుడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ క్రియేట్ చేస్తున్నాడు. వన్డే, టీ20ల్లో టాప్ బ్యాటర్‌గా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్న బాబర్ ఆజమ్.. టెస్టుల్లో టాప్ 4లో ఉన్నాడు..
ఒకప్పుడు విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టాప్ 5 ర్యాంకింగ్స్‌లో ఉన్న బ్యాటర్‌గా నిలిస్తే, ఇప్పుడు ఆ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాల రికార్డుల వేటను కూడా మొదలెట్టేశాడు బాబర్ ఆజమ్...
27
Babar Azam, Virat Kohli
మరోవైపు కరోనా లాక్‌డౌన్ నుంచి సెంచరీ మార్కు అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు విరాట్ కోహ్లీ. మెరుపు వేగంతో దశాబ్ద కాలంలో 20 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 71వ సెంచరీ మార్కు అందుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు..
37
ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ అస్సలు బాలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడి 12 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో 25 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
47
కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా ద్వారా సానుభూతి వ్యక్తం చేశాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్... ‘ఈ సమయంలో కూడా గడిచిపోతుంది... ధైర్యంగా ఉండు విరాట్ కోహ్లీ...’ అంటూ టీ20 వరల్డ్ కప్ 2021 సమయంలో కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు బాబర్...
57
Image Credit: Getty Images
అయితే ఈ పోస్టుపై భారత అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘జింబాబ్వేపై సెంచరీలు చేసి టాప్ బ్యాటర్ అని చెప్పుకునే వీడు కూడా ఆఖరికి విరాట్ కోహ్లీపై సానుభూతి వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా...’ అంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతూ కామెంట్లు పెడుతున్నారు...
67
మరికొందరేమో విరాట్ కోహ్లీపై ట్వీట్ చేసేందుకు కూడా టీ20 వరల్డ్ కప్ 2021 సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫోటోను వాడిన బాబర్ ఆజమ్, కావాలని ఆ మ్యాచ్‌ని గుర్తు చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు...
77
Virat Kohli-Babar Azam
టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 1013 రోజులు టాప్‌లో కొనసాగితే, బాబర్ ఆజమ్ ఆ రికార్డును అధిగమించేశాడు. అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 17 ఇన్నింగ్స్‌ల్లో 1000 వన్డే పరుగులు చేస్తే, బాబర్ ఆజమ్ 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డును అధిగమించాడు..