వాళ్లను కాపాడడానికే కోహ్లీ తలపై గన్ పెడుతున్నారు... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్...

Published : Jul 15, 2022, 10:44 AM IST

భారత క్రికెట్ టీమ్ పర్ఫామెన్స్ కంటే విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే ఇప్పుడు ఎక్కవ చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన క్రేజ్ సంపాదించుకున్న విరాట్ కోహ్లీ గురించి మంచో చెడో మాట్లాడి యూట్యూబ్‌లో వ్యూస్, మీడియాలో పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు మాజీ క్రికెటర్లు... పాక్ మాజీ క్రికెటర్లు ఇందులో ముందు వరుసలో ఉన్నారు...

PREV
16
వాళ్లను కాపాడడానికే కోహ్లీ తలపై గన్ పెడుతున్నారు... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్...
Virat Kohli

తాజాగా పాక్ మాజీ కెప్టెన్, స్పిన్నర్ రషీద్ లతీఫ్, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు...

26
Image credit: Getty

‘మాతరంతో పోలిస్తే మోడ్రన్ డే క్రికెట్ చాలా భిన్నమైనది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక వీక్‌నెస్ ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ కారణంగా ఆ వీక్‌నెస్‌ని ఇట్టే పసిగడుతున్నారు బౌలర్లు...

36
Image credit: Getty

అయితే వాళ్లు గేమ్‌ని మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నించడం లేదు. విరాట్ కోహ్లీ లాగే కేన్ విలియంసన్‌ కూడా ఇదే రకమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. విరాట్‌కి షార్ట్ లెంగ్త్ డెలీవరీలే వీక్‌నెస్...

46

ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలంటే బెస్ట్ కోచ్‌లను కలిసి మాట్లాడాలి, తన వీక్‌నెస్‌ను తొలగించుకోవడానికి కృషి చేయాలి... క్లియర్‌గా చెప్పాలంటే మళ్లీ బేసిక్స్ నుంచి మొదలెట్టాలి...

56

అయితే ఒక్క ప్లేయర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ, మిగిలిన టీమ్‌ని పట్టించుకోవడం లేదు. మిగిలిన ప్లేయర్లను సేఫ్ చేయడానికి విరాట్ కోహ్లీ నెత్తిపై గన్ పెడుతున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినప్పుడు మిగిలిన వాళ్లు ఎలా ఆడారు?

66

పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రోహిత్ ఈ మధ్యకాలంలో పరుగులు చేయలేకపోతున్నా అతని ఫామ్ గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడడం లేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్, స్పిన్నర్ రషీద్ లతీఫ్..

Read more Photos on
click me!

Recommended Stories