హార్ధిక్ పాండ్యాని ఈ ఒక్క టెస్టు ఆడిస్తే ఏం పోతుంది... హర్భజన్ సింగ్ కామెంట్...

First Published Jun 30, 2022, 6:22 PM IST

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు కోసం సిద్ధమవుతోంది భారత జట్టు. ఇదే టైంలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత బీ జట్టు, కౌంటీ టీమ్‌లతో టీ20 వార్మప్ మ్యాచులు ఆడబోతోంది. అయితే హార్ధిక్ పాండ్యాకి ఐదో టెస్టు టీమ్‌లో చోటు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

2019లో గాయపడి, వెన్నెముకకి శస్త్రచికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా, దాదాపు మూడేళ్లుగా టెస్టు ఫార్మాట్‌కి దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్ సాధిస్తున్న పాండ్యాతో సుదీర్ఘ స్పెల్స్ వేయించడం వీలవుతుందా? అనేది కూడా అనుమానమే...

టీ20ల్లో కూడా చాలా అరుదుగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసుకుంటున్న హార్ధిక్ పాండ్యా, వన్డేల్లో 5 లేదా టెస్టుల్లో సుదీర్ఘ సమయంలో క్రీజులో ఉండగలడా? అందుకు అతని ఫిట్‌నెస్ సహకరిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది...

Image credit: PTI

‘టీమిండియాకి ఇప్పుడు హార్ధిక్ పాండ్యా అవసరం చాలా ఉందని నాకు అనిపిస్తోంది. ఇది ఒకే ఒక్క టెస్టు, సిరీస్ కూడా కాదు. కాబట్టి హార్ధిక్ పాండ్యా ఆడించినా పెద్ద నష్టమేమీ జరగదు. అదీకాకుండా ఇంగ్లాండ్ పిచ్‌లు సీమర్లకు బాగా అనుకూలిస్తాయి...

శార్దూల్ ఠాకూర్ గత పర్యటనలో అద్భుతంగా రాణించారు. అయితే శార్దూల్‌తో పాటు హార్ధిక్ పాండ్యా కూడా టెస్టు టీమ్‌లో ఉండి ఉంటే టీమిండియా బౌలింగ్ మరింత బలంగా మారేది. ఆల్‌రౌండర్ కాబట్టి పాండ్యా పరుగులు కూడా చేయగలడు...

టీమిండియాకి ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ చేపట్టాక ఇంగ్లాండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అయితే మూడు మ్యాచుల్లో గెలిచినంత మాత్రం టాప్ క్లాస్ టీమ్ అయిపోదు. ఇంకా వాళ్లు చాలా నిరూపించుకోవాలి..

ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పై ఇంగ్లాండ్‌ను ఓడించే అవకాశం దక్కింది. దీన్ని భారత జట్టు చక్కగా వాడుకుంటుందని అనుకుంటున్నా. ఈ మ్యాచ్ గెలవడానికి కావాల్సిన సత్తా భారత జట్టులో ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..

click me!